అందరూ అవకాశ వాదులే అంటోన్న నటి!
తాజాగా ఇలాంటి వాటిని స్పృశిస్తూ అవకాశ వాదం గురించి బాలీవుడ్ నటి నస్రత్ భరూచా స్పందించింది. సినిమా అవకాశాలు అందుకోవడంలో తాను కూడా ఓగొప్ప అవకాశ వాదిగా పేర్కోంది.;
చిత్ర పరిశ్రమలో ఎన్నో కలలు, ఆశలతో ప్రయాణం మొదలు పెడతారు. అవి సక్సెస్ అవుతాయా? లేదా? అన్న దానికి ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ దేనికి గ్యారెంటీ ఉండదు. పోరాటమన్నది నిత్యకృత్యం. అలా చేసిన సక్సస్ అవుతామనే నమ్మకం ఉండదు. ప్రతిభతో పాటు, ఆవగింజంత అదృష్టం కూడా తోడైనప్పుడే? సాధ్యమవుతుంది. ఈ రంగంలోనూ రాజకీయాల తరహాలో ఎన్నో కుతంత్రలు, కుట్రలు జరుగుతుంటాయి. వాటన్నింటిని దాటుకుని వెళ్లినప్పుడే సక్సెస్ అన్నది కనిపిస్తుంది. ఈ క్రమంలో మనసుకు ఇష్టం లేని ఎన్నో పనులు కూడా చేయాల్సి ఉంటుంది? అన్నది కాదనలేని నిజం.
ప్రతీ ఒక్కరికీ ఈ దశ తప్పదు:
తాజాగా ఇలాంటి వాటిని స్పృశిస్తూ అవకాశ వాదం గురించి బాలీవుడ్ నటి నస్రత్ భరూచా స్పందించింది. సినిమా అవకాశాలు అందుకోవడంలో తాను కూడా ఓగొప్ప అవకాశ వాదిగా పేర్కోంది. కలల జాబితాలో ఉన్న ఓ పాత్ర పోషించే అవకాశం వస్తే? అందులో తాను నటించాలనుకుంటున్నాను? అన్నది ఓపెన్ గా చెబుతానంది. ఆ పాత్రకు దర్శకుడు మరో నటిని అనుకున్నా? ఆ అవకాశం తనకే వచ్చేలా చేయాల్సిన కొన్ని రకాల జిమ్మికులకు వెనుకాడనంది. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి చేయక తప్పదంది.
ఓపెన్ గా ఉండటం ఉత్తమం:
నటన పరంగా రాణించాలంటే కొన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండటం ఎంతో ఉత్తమ మైనదిగా తెలిపింది. నోరు తెరిచి అడగకపోతే? ఒక్కోసారి వచ్చే అవకాశాలు కూడా చేజారిపోతాయంది. అందుకే అవకాశ వాదిగా ఉండటం చెడ్డ విషయం కాదంది. కానీ ఆ మార్గంలో వెళ్లాలని అని నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం తీసుకునే చర్యలు మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలి అంది. తనకు ఇవన్నీ ఒక్క రోజు లో రాలేదని ఇండస్ట్రీలో కొంత కాలం కొనసాగిన అనతరం..ఎదురైన అనుభవాల నేపథ్యం నుంచే? తాను తెలుసుకున్నట్లు గుర్తు చేసుకుంది.
2025 లో రెండు చిత్రాలతో:
ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమతే. కెరీర్ ఆరంభంలోనే అమ్మడు `తాజ్ మహాల్` అనే చిత్రంలో నటించింది. అప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి ఫెయిలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో వెంటన ఏ మరో అవకాశం రాలేదు. అదే సమయంలో `తాజ్ మహాల్` ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత తెలుగులో కొనసాగలేదు. కోలీవుడ్ లో కూడా `వలీబా రాజా` అనే చిత్రంలో నటించింది. కానీ అక్కడా ఆ ఒక్క చిత్రానిఆకే పరిమితమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే నటిగా కొనసాగుతోంది. ఈ ఏడాది `చిచోరి-2`, `ఉఫ్ యహో సియాపా` చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అవి ఆశించిన ఫలితాలు సాధించలేదు.