ఫుల్ స్వింగ్ లో మల్టీస్టారర్ ట్రెండ్.. లైన్ లో పలు క్రేజీ సినిమాలు
మామూలు సినిమాలతో పోలిస్తే మల్టీస్టారర్ సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరు. ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ తో పాటూ, రిలీజ్ కు ముందే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్, హైప్ వస్తాయి.;
సౌత్ ఇండియాలో ఎప్పట్నుంచో మల్టీస్టారర్లు వస్తున్నాయి. మధ్యలో ఎవరికి వారే భారీ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడంతో ఈ ట్రెండ్ కాస్త తగ్గింది కానీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన తర్వాత ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ తర్వాత మల్టీస్టారర్లు బాగా ఎక్కువయ్యాయి.
ఇప్పటికే రిలీజైన ఎన్నో మల్టీస్టారర్లు
ఒక స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ కీలక పాత్రలో నటించడం చాలా కామనైపోయింది. అయితే ఆ పాత్ర కేవలం క్యామియో లాగా కాకుండా కథలో ప్రధానంగా ఉండటంతో అది మల్టీస్టారర్ సినిమాలా మారిపోతుంది. మహా సముద్రం, జైలర్, పొన్నియన్ సెల్వన్, వేట్టయాన్, ఆచార్య, కల్కి, వార్2, కూలీ ఇంకా ఎన్నో సినిమాలు రాగా కేవలం క్యాస్టింగ్ తోనే ఆయా సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది.
మల్టీస్టారర్ సినిమాలకు స్పెషల్ అడ్వాంటేజ్
మామూలు సినిమాలతో పోలిస్తే మల్టీస్టారర్ సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరు. ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ తో పాటూ, రిలీజ్ కు ముందే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్, హైప్ వస్తాయి. అందుకే మేకర్స్ కూడా ఈ మల్టీస్టారర్లపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మల్టీస్టారర్ సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే దర్శకనిర్మాతల దృష్టి వాటిపై పడింది.
అయితే త్వరలోనే సౌత్ నుంచి పలు మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మన శంకరవరప్రసాద్ గారు అన్నింటికంటే ముందుగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాలో చిరూతో కలిసి మొదటిసారి విక్టరీ వెంకటేష్ స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్2 లో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. 45 అనే సినిమాలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్‌వీ శెట్టి స్క్రీన్ ను షేర్ చేసుకోనుండగా, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలన్నింటిపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకొనగా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు రిలీజవుతాయా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.