పెళ్లైన వాడిని ప్రేమించ వ‌ద్ద‌ని సీనియ‌ర్ నటి సందేశం!

Update: 2020-03-03 21:30 GMT
పెళ్లైన మ‌గాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంలో సినీ తార‌లే ముందుంటార‌నేది తెలిసిన సంగ‌తే. ఇండియాలో దేవ‌త‌లుగా ప్రేక్ష‌కుల చేత హర‌తులు అందుకున్న ప‌లువురు హీరోయిన్లు రెండో పెళ్లి వాడినే పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టికే ఒక పెళ్లి అయ్యి, సంతానం కూడా క‌లిగిన వారినే వారు పెళ్లి చేసుకున్నారు. కొంద‌రు అయితే స‌ద‌రు వ్య‌క్తి విడాకులు తీసుకోక‌పోయినా.. రెండో పెళ్లికి రెడీ అయ్యారు.

ఈ జాబితాలో హేమ‌మాలిని, శ్రీదేవి వంటి ప్ర‌ముఖ న‌టీమ‌ణులు నిలుస్తారు. అలాగే మ‌రి కొంత‌మంది హీరోయిన్లు కూడా అదే త‌ర‌హాలో రెండో పెళ్లి వ్య‌క్తిని పెళ్లాడ‌టం, ప్రేమించ‌డం వంటివి చేశారు. ఇలాంటి వారి జీవితాల‌ను ప‌రిశీలించి, త‌న క‌థ‌ను కూడా బేరీజు వేసుకుని.. రెండో పెళ్లి వాడి జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని హితోప‌దేశం చేస్తోంది నీనా గుప్తా.

ఈమె కూడా ఒక విదేశీ క్రికెట‌ర్ తో స‌హ‌జీవ‌నం చేసింది. ఫ‌లితంగా ఒక కూతురు కూడా క‌లిగింది. అయితే వీరు పెళ్లి చేసుకోలేదు. ఆ త‌ర్వాత ఎవ‌రికి వార‌య్యారు. అత‌డు మ‌రెవ‌రో కాదు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం రిచ‌ర్డ్స్. వీరికి ఒక కూతురు కూడా ఉంది. పెళ్లి మాత్రం లేదు.

మ‌రి ఈ అనుభ‌వంతోనో చెబుతోందో ఏమో కానీ.. పెళ్లైన వాడి జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని ఈమె సోస‌ల్ మీడియాలో ఒక వీడియో సైతం పెట్టింది. వివాహితుడితో ప్రేమ వ‌ల్ల ప‌లు ఇబ్బందులు ఉంటాయ‌ని, స‌ద‌రు మ‌గాళ్లు త‌న మొద‌టి భార్య‌ను-పిల్ల‌ల‌ను వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌ర‌ని, ఏవేవో కార‌ణాలు చెబుతూ.. వాళ్ల‌ను వ‌ద‌ల‌కుండా మీతో రిలేష‌న్ షిప్ మెయింటెయిన్ చేస్తార‌ని... అబ‌ద్ధాలు చెబుతూ కాలం గ‌డిపేస్తార‌ని నీనా అంటోంది. అందుకే సెకెండ్ హ్యాండ్ మ‌గాళ్ల జోలికి వ‌ద్ద‌ని ఈమె హితోప‌దేశం చేస్తోంది!
Tags:    

Similar News