విడాకులు తీసుకున్న స్టార్‌ కపుల్‌ మళ్లీ కలిసినట్లేనా?

Update: 2021-01-09 07:45 GMT
బాలీవుడ్‌ సూపర్‌ హీరో.. సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ 2014లో కొన్ని కారణాల వల్ల భార్య సుశానే ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరు కొడుకులు ఆమె దూరం అవ్వడంతో కొంత కాలం హృతిక్ రోషన్‌ మానికంగా సంఘర్షణకు లోనయ్యాడు. పిల్లలు మరియు సుశానే మళ్లీ హృతిక్ రోషన్‌ జీవితంలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల కోసం అంటూ హృతిక్‌ మరియు సుశానే లు హాలీడే లకు వెళ్లడంతో పాటు ఇద్దరు కొత్త జీవితంను మొదలు పెట్టినట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

లాక్‌ డౌన్‌ టైమ్‌ లో హృతిక్ మరియు సశానే ఖాన్‌ లు కలిసే ఉన్నారని ఆ సమయంలో వీరు మళ్లీ దగ్గర అవ్వాలనుకున్నారు అంటూ వారి సన్నిహితులు చెబుతున్నారు. అధికారికంగా పెళ్లి చేసుకోకున్నా వీళ్లు అనధికారికంగా కలిసి ఉంటున్నారు. త్వరలోనే వీళ్లు అధికారికంగా మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం పిల్లలకు తల్లిదండ్రి ఇద్దరి అవసరం ఉంది. కనుకే వీరిద్దరు కలిసి ఇలా కొత్త జీవితంను ఆరంభించే యోచనలో ఉన్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో కూడా టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News