ప్రభాస్ ఒక 10 కోట్లు పుచ్చుకుంటాడా?
'ప్రభాస్‌కి 65కోట్లు లాభం. మూడేళ్ల నిరీక్షణ వృథా అనుకున్నవాళ్లని ఫూల్స్‌ని చేశాడు' అంటూ వివాదాల రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అవునా? ఇదంతా నిజమా? అని వెతుక్కున్నవాళ్లకు ఎంత జుట్టు పీక్కున్నా సంతృప్తి చెందే సమాధానం దొరకడం లేదు. అంతేనా ప్రభాస్ మరీ అంత కమర్షియలా? అంత పెద్ద మొత్తానికి పారితోషికం కోట్ చేశాడా? అని ప్రశ్నిస్తున్నారు.
అసలు బాహుబలి 300కోట్లు వసూళ్లు తెచ్చుకున్నా, అందులోంచి నిర్మాతలకు, రాజమౌళికే మెజారిటీ భాగం ముట్టేది. మరి ప్రభాస్‌కి ముట్టిన పారితోషికం ఎంత? ఒక సందర్భంలో కేవలం నామినల్ ఫీజ్ మాత్రమే ప్రభాస్ తీసుకున్నాడని జక్కన్న చెప్పాడు. ఇప్పటివరకూ ప్రభాస్‌కి ఇచ్చే భత్యం అతడి ఇమేజ్ దృష్ట్యా 4 కోట్లు లోపే. టాలీవుడ్‌లో ఉన్న ఆరుగురు స్టార్ హీరోల్లో ఒకడిగా నెమ్మది నెమ్మదిగా మార్కెట్ గ్రాఫ్‌ని పెంచుకుంటున్నాడు కాబట్టి అదనపు గిఫ్టులేవైనా అందుతాయేమో కానీ క్యాష్ అయితే ఇదేనని ఓ ట్రేడ్ పండితుడు సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు బాహుబలి అన్ని కోట్లు వసూలు చేసింది కాబట్టి కాసింత ఎక్కువే ఇస్తారనుకోవడానికి లేదు. సినిమాకు 250 కోట్లు ఖర్చయితే.. అసలు లాభాలు రాకుండా ప్రభాస్‌కు వాటాలె ఎలా పంచుతారు?
ఇకపోతే తమిళ హక్కుల రూపంలో బాహుబలిని ప్రభాస్ స్నేహితులు (యువిక్రియేషన్స్ గ్యాంగ్) స్టూడియోగ్రీన్ సంస్థతో కలిపి 18కోట్లకు తమిళ హక్కులు కొనుక్కుని రూ.25కోట్లకు అమ్ముకున్నారు. దాంతో 7కోట్లు లాభం మిగిలింది. అందులోంచి సగం జ్ఞానవేల్‌రాజా లాక్కున్నా, మిగతా మూడున్నర కోట్లు ప్రభాస్‌కి దక్కినట్టు. ఆ లెక్కన చూస్తే మనోడు ఓ 10 కోట్లు లోపు పుచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువంటే కష్టం బాబోయ్!!