విక్రమ్ కుమార్ నెక్స్ట్ అప్డేట్స్ ఏవి?
టాలీవుడ్ లో టాలెంటెడ్ ఫిలిం మేకర్ల లిస్టు తీస్తే అందులో తప్పనిసరిగా విక్రమ్ కుమార్ పేరు ఉంటుంది. ఫిలిం మేకింగ్ విషయంలో విక్రమ్ టాప్ క్లాస్ అని అంటారు కానీ కమర్షియల్ సక్సెస్ విషయంలో గొప్ప ట్రాక్ రికార్డు లేదు. విక్రమ్ కెరీర్లో 'మనం'.. 'ఇష్క్' లాంటి క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీసు దద్దరిల్లి పోయే కలెక్షన్లు మాత్రం రాలేదు. అందుకే టాప్ స్టార్లు విక్రమ్ తో సినిమా చేసేందుకు ముందువెనక అలోచిస్తుంటారని ఒక టాక్ ఉంది.
విక్రమ్ కుమార్ తన లాస్ట్ సినిమాను న్యాచురల్ స్టార్ నాని తో తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో విక్రమ్ కుమార్ కథ మొదటికే వచ్చింది. నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. '13B' తరహాలో ఓ హారర్ ఫిలిం ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్స్ ఏవీ రావడం లేదు. మరి ఈ సినిమా ఉందా లేదా అన్నది అర్థం కావడం లేదని ఫిలిం నగర్ టాక్.
ఒక దశలో తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేసినప్పుడు విక్రమ్ కుమార్ ఇక టాప్ స్టార్లతోనే సినిమా చేస్తారని అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆ సినిమా తర్వాత విక్రమ్ కెరీర్ గ్రాఫ్ పైకి మాత్రం వెళ్లడం లేదు. విక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో చేస్తారో ఎప్పుడు ప్రకటన వస్తుందో వేచి చూడాలి.