జక్కన్న సవాలు కి లెక్కల మాస్టారి సమాధానం...!

Update: 2020-04-22 05:15 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ లో 'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండింగ్‌ లో ఉంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనికి 'betheREALMAN' అనే పేరు పెట్టి షేర్ చేస్తూ.. కొంతమందిని నామినేట్ చేస్తున్నారు. ఛాలెంజ్ ను స్వీకరించిన వ్యక్తులు వాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ.. ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ లో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన రాజ‌మౌళి దీనికి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కీర‌వాణి, శోభు యార్ల‌గ‌డ్డ, సుకుమార్‌ ల‌ను నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇందులో ముందుగా ఎన్టీఆర్ టాస్క్‌ ని పూర్తి చేసి ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, కొర‌టాల శివ‌ల‌ని నామినేట్ చేశారు. చ‌ర‌ణ్ కూడా ఛాలెంజ్ పూర్తి చేసి త్రివిక్ర‌మ్, బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్‌ సింగ్, రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్‌ ల‌కు ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ ని స్వీక‌రిస్తున్న‌ట్టు 'ఛాలెంజ్‌' సినిమా టైటిల్ వాడుకున్న చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ వీడియో కోసం ఎదురుచూస్తున్నాన‌ని రిప్లై ఇచ్చారు. తాజా జ‌క్క‌న్న విసిరిన ఛాలెంజ్‌ ని స్వీక‌రించిన సుక్కు త‌న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.‌ ఇల్లు ఊడ్చి.. ఫ్లోర్ క్లీన్ చేసి.. పాత్ర‌లు క‌డిగిన సుకుమార్ త‌న ఛాలెంజ్‌ పూర్తి చేశారు. ఈ వీడియోకి రంగస్థలం సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని జత చేసాడు. ఛాలెంజ్ డన్ రాజమౌళి గారూ అంటూ.. ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్‌ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్.
Tags:    

Similar News