నన్ను వదిలెయ్యండి బాబాయిలు.. ప్లీజ్

Update: 2018-12-10 07:25 GMT
దర్శకుడు సాయి రాజేష్ పేరు చెప్తే వెంటనే మీరు గుర్తుపట్టకపోవచ్చేమో స్టీవెన్ శంకర్ అంటే మాత్రం టక్కున 'హృదయ కాలేయం' దర్శకుడిగా గుర్తించే అవకాశం అయితే ఉంది.  రెండూ అయన పేర్లే లెండి. అలా అని ఆయన ఫోటో చూపించి గుర్తు పట్టమంటే కాస్త కష్టమే.  ఇదే విషయం అయనకు తిప్పలు తెచ్చిపెడుతోందట.   

ఈమధ్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తనకెదురైన.. ఎదురవుతూ ఉన్న తిప్పలను జంధ్యాల స్టైల్ లో ఒక చిన్న కథలా వివరించాడు.  తన మీద అభిమానంతో చాలామంది దర్శకులు ఆడియో ఫంక్షన్ లకు పిలుస్తారని.. అక్కడ మొదటి వరసలో కూర్చోబెడతారని.. హీరోకు పరిచయం చెయ్యబోతే "వీడెవడ్రా!" అన్నట్టుగా చూస్తారని అన్నాడు. ఒకవేళ తనను 'హృదయ కాలేయం'  దర్శకుడిగా పరిచయం చేస్తే అప్పుడూ వారి ఎక్స్ ప్రెషన్ మరో వింతలా ఉంటుందని అన్నాడు. ఇక ఫంక్షన్ మొదలైన సమయంలో మొదటి రోలో ఉన్న తనను మెల్లగా రెండో వరసకు..  తర్వాత మూడో లైనుకు.. ఫైనల్ గా అది కూడా లేకుండా చేస్తారని. ఎంత ఓపిగ్గా ఉందామనుకున్నా కష్టంగా ఉందని.. అందుకే నన్ను ఎవరూ ఫిల్మీ ఈవెంట్స్ కు దయచేసి పిలవొద్దు అని విసుగుతో కూడిన ప్రేమ భావంతో వేడుకున్నాడు.

ఇక నిన్నొదల బొమ్మాళి టైపులో రివర్స్ లో 'నన్ను వదిలెయ్ బొమ్మాళి' అని ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ను వేడుకుంటున్నాడన్నమాట. పాపం..మరీ అంత ఇబ్బంది పెట్టకండి సార్లూ. అయన సినిమాలు.. వాటిలోని కామెడీ టాలీవుడ్ కు అవసరం.  అన్నట్టు సాయి రాజేష్ త్వరలో 'కొబ్బరిమట్ట' తో తెలుగువారి తాట తీస్తాడట!
Tags:    

Similar News