ముగ్గురు స్టార్ హీరోల‌ని బ్లాక్ చేయాల‌ని డైరెక్ట‌ర్ మైండ్ గేమ్

Update: 2021-04-14 07:30 GMT
భూమి త‌న చుట్టూ తాను తిరుగుతూ ఖ‌గోళం చుట్టి మొద‌ట బ‌య‌లు దేరిన చోటికే వ‌స్తుంది. ఈ ప్ర‌క్రియ‌ ఒక వ‌లయం పూర్త‌వ్వ‌‌డం లాంటిది. ఇప్పుడు చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోల స‌న్నివేశం అలానే ఉంది. ఒక‌దాని వెంట ఒక‌టిగా ప్రాజెక్టుల్ని క‌న్ఫామ్ చేయాలంటే చాలా ఆచితూచి అడుగులేస్తున్న స్టార్ హీరోలు ద‌ర్శ‌కుడి పేరును ప్ర‌క‌టించినా చివ‌రికి స్క్రిప్టు కుద‌ర‌క‌పోతే ఆ ప్రాజెక్ట్ ను క‌న్ఫామ్ చేయ‌లేని పరిస్థితి ఒక్కోసారి ఉంటోంది. అప్ప‌టికి ఏది అనుకూలం అయితే దానినే ఓకే చేస్తున్నారు. స్టార్ హీరోల‌ వ‌ల‌యంలోకి ఏ ద‌ర్శ‌కుడు ఎప్పుడు వ‌చ్చి చేర‌తాడో ఎవ‌రికీ తెలీదు.

ఇప్పుడు ఇదే వ‌లయం పాయింట్ ని ఓ స్టార్ డైరెక్ట‌ర్ తెలివిగా ఉప‌యోగించుకుంటున్నాడు. ఓ ముగ్గురు స్టార్ హీరోల స‌న్నివేశం ప‌సిగ‌ట్టిన ఓ తెలివైన ద‌ర్శ‌కుడు ఆ ముగ్గురి కోసం మూడు బౌండ్ స్క్రిప్టులు రెడీ చేసి వాళ్లంద‌రినీ వ‌రుస‌గా లాక్ చేయాల‌ని గ‌ట్టి ప్లాన్ తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌మౌళి-కొర‌టాల మాదిరిగానే అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా రికార్డులు సృష్టిస్తూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ప‌రిశ్ర‌మ‌ను స్పెల్ బౌండ్ చేసిన అత‌డు మ‌హేష్‌- అల్లు అర్జున్- ఎన్టీఆర్ వంటి స్టార్ల‌ను బ్లాక్ చేయాల‌ని మైండ్ గేమ్ స్టార్ట్ చేశార‌ట‌.

ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అన్న‌ది అటుంచితే.. అత‌డు వీళ్ల‌ను ఎలా లాక్ చేయాల‌ని భావిస్తున్నాడు? అన్న‌దే ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మ‌హేష్.. ఎన్టీఆర్ సినిమాల‌కు సంబంధించిన సందిగ్ధ ప్ర‌క‌ట‌న‌లు తెలిసిన‌దే. త్రివిక్ర‌మ్ ని కాద‌ని ఎన్టీఆర్ కొర‌టాల‌తో సెట్స్ కెళుతున్నారు. ఆచార్య పూర్తి చేసి తార‌క్ 30 కోసం కొర‌టాల రెడీగా అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ మ‌హేష్ తో ప‌ని చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ త్రివిక్ర‌మ్ తో పాటు పోటీప‌డుతున్న వేరొక ద‌ర్శ‌కుడు ఉన్నారు. ఇంత‌కుముందు మ‌హేష్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ తీసిన ఆ ద‌ర్శ‌కుడు ఇప్పుడు బౌండ్ స్క్రిప్టు ప‌ట్టుకుని మ‌హేష్ చుట్టూ తిర‌గ‌నున్నార‌ట‌. మ‌హేష్ స‌ర్కార్ వారి పాట ముగించేప్ప‌టికి త్రివిక్ర‌మ్ తో పాటు అతడు కూడా రేస్ లో ఉంటాడ‌ని స‌మాచారం. మ‌హేష్ ఓ ప‌ట్టాన స్క్రిప్టు న‌చ్చ‌క‌పోతే ఏదీ అంగీక‌రించ‌రు. త్రివిక్ర‌మ్ గ‌తంలో అత‌డు- ఖ‌లేజా లాంటి ఫ్లాపులే తీశారు కాబ‌ట్టి అది త‌న‌కు లాభిస్తుంద‌ని స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ కాపు కాసుకుని కూచున్నాడ‌ట‌.

మ‌రోవైపు అదే స్టార్ డైరెక్ట‌ర్ బ‌న్నీని లాక్ చేసేందుకు త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే బన్ని కోసం కూడా ఒక బౌండ్ స్క్రిప్టు ప్రిపేర‌వుతోంది. బ‌న్ని పుష్ప చిత్రీక‌ర‌ణ ముగించి ఫ్రీ అవ్వ‌గానే ఈ స్క్రిప్టు అత‌డి వ‌ద్ద‌కు వెళ్ల‌నుందిట. అంటే వేణు శ్రీ‌రామ్ తో ఐక‌న్.. కొర‌టాల‌తో ఏప్రిల్ 2022 లో మొద‌ల‌య్యే సినిమా కంటే ముందే అత‌డు స్క్రిప్టుతో బ‌న్నీని లాక్ చేయాల‌ని గ‌ట్టి ప్లాన్ తో ఉన్నాడ‌ట‌.

అలాగే తార‌క్ 30 పూర్త‌య్యే ప్ప‌టికి అత‌డి కోసం కూడా మ‌రో స్క్రిప్టును స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ రెడీ చేస్తున్నాడ‌ని తెలిసింది. మొత్తానికి స్టార్ల ఆలోచ‌న‌ను ప‌సిగ‌ట్టి తెలివిగా మ‌ధ్య‌లో దూరుతున్న ఈ ద‌ర్శ‌కుడి వల్ల ఇప్పుడు రాజ‌మౌళి- మ‌హేష్ సినిమా కూడా కాస్త అటూ ఇటూ జ‌రుగుతుంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది.

ఇప్పటివరకు ఎన్టీఆర్ 30 మాత్రమే అధికారికంగా ప్రకటించారు. SSMB 28  కానీ.. ఏఏ21 కానీ అధికారికంగా క‌న్ఫామ్ కాలేదు. ఇప్పుడు ఊహిస్తున్న దర్శ‌కుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చి అత‌డు మ‌ధ్య‌లో దూర‌డం చూస్తుంటే మునుముందు ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఆ డైరెక్ట‌ర్ మైండ్ గేమ్ ఆడ‌డంలో భ‌లే ముదురు అన్న టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది.
Tags:    

Similar News