• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూడేళ్ల నుంచి బన్నీ కోసం...

మూడేళ్ల నుంచి బన్నీ కోసం ట్రయల్స్..పని మాత్రం కాలేదు!

By - Tupaki Desk
Update: 2020-04-27 01:30 GMT
కొంత మంది డైరెక్టర్లకు మొదటి సినిమాతోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కుతుంది కొంతమంది రెండో సినిమా.. మూడో సినిమాతోనే స్టార్ హీరోల డైరెక్ట్ చేస్తారు. అయితే కొందరికి మాత్రం ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నా.. ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ ఉన్నా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కలేదు. మారుతి పరిస్థితి కూడా దాదాపుగా అంతే.  దాదాపు మూడేళ్ల నుంచి మారుతి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఆ శుభ తరుణం మాత్రం రాలేదు.

'మహానుభావుడు' సినిమా తర్వాత ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేద్దామనే ఉద్దేశంతో మారుతి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ సమయంలో బన్నీకి 'ప్రతిరోజు పండగే' కథను వినిపించాడు. బన్నీ కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట.  ఆ సమయంలో బన్నీ 'నా పేరు సూర్య' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బన్నీతో సినిమా ఫిక్స్ అని మారుతి అనుకున్నాడు. అయితే మారుతికి అదృష్టం కలిసి రాకపోవడంతో 'నా పేరు సూర్య' ఫ్లాప్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో బన్నీకి అలాంటివి ఫ్లాప్ ఎప్పుడూ తగల్లేదు. దీంతో అల్లు క్యాంప్ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. మారుతి సినిమాను మరో హీరోతో జీఏ2 బ్యానర్లో  సెట్ చేశారు. దానికి కూడా మారుతి చాలా కష్టపడి సాయి ధరమ్ తేజ్ ను ఒప్పించాలని వచ్చిందట.

'ప్రతి రోజూ పండగే' తర్వాత జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో మారుతికి మరో కమిట్మెంట్ ఉంది. ఆ డీల్ ప్రకారమే మారుతి ఒక ఫ్యామిలీ స్టోరీని రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాను బన్నీతో చేయాలని మారుతికి మనసులో ఉందట.. కానీ అల్లు క్యాంప్ మాత్రం ఈ ప్రాజెక్టును నానితో ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ కు ప్రస్తుతం సుకుమార్ సినిమా లైన్ లో ఉంది. కనీసం మూడేళ్ళ వరకు అల్లుఅర్జున్ కాల్షీట్స్ అందుబాటులో లేవని అంటున్నారు. ఈ లెక్కన మారుతి వెయిటింగ్ పీరియడ్ మరింత గా పెరిగినట్టే.

 
    

Tags:    
  • Director Maruthi 
  • Allu Arjun 
  • Telugu News 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS