కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది: మారుతి

Update: 2022-06-13 04:48 GMT
మొదటి నుంచి కూడా మారుతి తన సినిమాల ద్వారా సందేశాలను ఇచ్చే పని పెట్టుకోలేదు. ఆయన కథలు నాన్ స్టాప్  ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తుంటాయి. కథ ఏదైనా అందులో కామెడీ ఉండేలా ఆయన చూసుకుంటాడు.

అలా కామెడీ టచ్  తో ఆయన రూపొందించిన యాక్షన్  సినిమానే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన  ఈ సినిమాను, జూలై 1వ తేదీన భారీస్థాయిలో విడుదల  చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడాడు.

"ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది .. సినిమా అంతకు మించి  ఉంటుంది. హ్యాపీగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. గోపీచంద్ గారు ఈ కథను ఒప్పుకున్నా తరువాత  ఆయనను బాగా చూపించాలనే విషయం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాను.

ఆయన కూడా అందుకు తగినట్టుగా మంచి ఎఫర్ట్ పెట్టారు.  ఈ రోజున ట్రైలర్ కి ఈ స్థాయి  రెస్పాన్స్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం ఇలాగే కంటిన్యూ  చేద్దాం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఈ కథలో కనిపిస్తాయి.
Read more!

జూలై 1వ తేదీన ఈ సినిమాను తప్పకుండా చూడండి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్నిరకాల అంశాలు ఈ  సినిమాలో కనిపిస్తాయి. ఇంతమంచి  సినిమా తీసే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు యూవీ వారికీ .. గీతా ఆర్ట్స్  2వారికి ధన్యవాదాలు  తెలియజేస్తున్నాను. రాశి ఖన్నా పాత్రను కొత్తగా  డిజైన్స చేయడం జరిగింది. ఆమె పాత్ర  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అందుకు ఆమెకి నేను థ్యాంక్స్  చెబుతున్నాను. సప్తగిరి నా దృష్టిలో ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు .. నా తమ్ముడితో సమానం. మా ఇద్దరి మధ్య ఒక తెలియని అనుబంధం ఉంది.

ఇక శ్రీనివాసరెడ్డి -  ప్రవీణ్ ఇద్దరూ కూడా నేను ఎప్పుడు పిలిచినా ఏవీ అడక్కుండా వచ్చేసి  యాక్ట్  చేసేసి వెళ్లిపోతుంటారు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం,  టీమ్ లోని సభ్యులంతా కష్టపడి పనిచేయడం. ఈ  సంతోషాన్ని రిలీజ్ వరకూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్  లో మళ్లీ కలుద్దాం" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News