'నాకు వచ్చిన విధంగా నేను రాస్తాను.. త్రివిక్రమ్ లాగా రాయలేను'
'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న శేఖర్ కమ్ముల.. సున్నితమైన ప్రేమకథలకు తనదైన శైలిలో దృశ్యరూపం ఇస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఆనంద్' 'గోదావరి' 'హ్యాపీడేస్' 'ఫిదా' వంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే ఇప్పుడు శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి.. లైంగిక వేధింపులు, కుల వివక్ష వంటి తీవ్రమైన సమస్యల నేపథ్యంలోని ప్రేమ కథతో వచ్చాడు. అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరి' సినిమా అన్ని చోట్లా మంచి స్పందన తెచ్చుకుంటోంది.
కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా 'లవ్ స్టోరి' నిలిచింది. యూఎస్ఏ లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సాధారణంగా మనం తమిళంలో ఈ తరహా సినిమాలను చూస్తుంటాం. వెట్రిమారన్ - పా. రంజిత్ వంటి దర్శకులు ఇలాంటి సామాజిక నేపథ్యమున్న కథలను డీల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు శేఖర్ కమ్ముల అలాంటి సమస్యలను తన స్టైల్ లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇటీవల దర్శకుడు కమ్ముల శేఖర్ దీని గురించి మాట్లాడుతూ.. ''కులవివక్ష వేలాది ఏళ్లుగా వేళ్లూనుకొని ఉన్న సమస్య. ‘లవ్ స్టోరి’ సినిమాలో నేను దీనికి పరిష్కారం చెప్పడం లేదు. ఆ సమస్యను ఎత్తిచూపుతున్నాను అంతే. సృష్టిలో ఎక్కువ తక్కువ అని ఉండదు. కులం కారణంగా సాటి వ్యక్తిని చిన్నచూపు చూడకూడదని మనకు తెలుసు. కానీ దాన్ని మనం పాటించం. తెలుగులో సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమాలు రాకపోవడానికి నేను కూడా బాధ్యుణ్ణే. అలాంటి సినిమాలు చూసే అలవాటును ప్రేక్షకుల్లో చంపేశాం'' అని అన్నారు.
''అయితే ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కొత్త ఐడియాలను ఆదరిస్తున్నారు. రొటీన్ కథలు వారికి బోర్ కొడుతున్నాయి. అందుకే వాటిని తిప్పి కొడుతున్నారు. ‘పలాస’, ‘కంచరపాలెం’ లాంటి చిత్రాలతో మూస ధోరణికి కొంచెం భిన్నంగా వెళ్తున్నాం. ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమా వాటికి నాంది పలుకుతుంది. ఇదొక ట్రెండ్ అవుతుంది. భవిష్యత్తులో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చిత్రాలు రావాలి. స్టార్ హీరోలు నటిస్తే మరింత వేగంగా మార్పు వస్తుంది'' అని దర్శకుడు అన్నారు.
''కుల వివక్ష - లింగ వివక్ష లాంటి రెండు పెద్ద అంశాలను కలిపి చెప్పడం కత్తిమీద సాము. తల వంచుకోవాల్సి వస్తుందేమో.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేది. నాపైన ఎవరి ప్రభావం ఉండదు. నా చుట్టూ ఉన్న సమాజంలో నేను చూసిన ఏదైనా సమస్యను ప్రస్తావిస్తూ సినిమాగా మలుస్తాను. నాకు అన్నీ వచ్చని చెప్పి ఏమీ తెలియని సబ్జెక్ట్ ను సినిమాగా తీయలేను. సినిమా చూసిన వాళ్లలో ఇది నా కథే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నాకు వచ్చిన విధంగా నేను రాస్తాను. నేను త్రివిక్రమ్ లాగా రాయలేను. నా సినిమా ద్వారా నిజాయితీగా నేను అనుకున్నది చెప్పగలుగుతున్నాను'' అని శేఖర్ కమ్ముల చెప్పారు.
ధనుష్ తో చేయబోయే థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ''ధనుష్ ఏ పాత్ర అయినా అలవోకగా ఒదిగిపోతాడు. టెన్త్ క్లాష్ స్టూడెంట్ గా.. 70 ఏళ్ల ముసలి వ్యక్తిలా కనిపించగలగడం అతని ప్రత్యేకత. అతనొక నిజమైన నటుడు. నేను స్టోరీ చెప్పగానే ఓకే అన్నాడు. అంత త్వరగా ఒప్పుకుంటారని ఆనుకోలేదు. మీరు స్పెషల్ సినిమాలు చేశారు.. కథ కూడా స్పెషల్ గా ఉంది. చేద్దాం అన్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో రూపొందే పాన్ ఇండియా చిత్రం'' అని శేఖర్ కమ్ముల తెలిపారు.