సెట్‌ లో కూడా అనుష్క 'నిశబ్ద'మే

Update: 2020-09-29 00:30 GMT
అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'నిశబ్దం' సినిమా అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అనుష్క మరియు మాధవన్‌ ల జోడీకి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో అంజలి మరియు షాలిని పాండేలు అదనపు ఆకర్షణగా ఉంటారని సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని మొదటి నుండి యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో అనుష్క మూగ చెవిటి అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం చాలా కష్టపడ్డట్లుగా దర్శకుడు హేమంత్‌ అన్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హేమంత్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం అనుష్క ప్రత్యేకంగా సైన్‌ లాంగ్వేజ్‌ పై అధ్యయనం చేసింది. ఇక షూటింగ్‌ స్పాట్‌ లో ఆమె అస్సలు ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆమె కనీసం ఫోన్‌ వచ్చిన సమయంలో లిఫ్ట్‌ కూడా చేసేవారు కాదు. సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజుల కూడా ఆమె సెట్‌ లో మాట్లాడింది చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే. ఆమెతో ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే నా వద్దకు వచ్చి చెప్పేవారు. ఒక మూగ అమ్మాయిగానే అనుష్క కెమెరా వెనుక చాలా రోజులు ఉన్నారని దర్శకుడు పేర్కొన్నాడు.
Tags:    

Similar News