పవన్ ని నమ్ముకొని ఆ డైరెక్టర్ అన్యాయం అయిపోయాడా...?

Update: 2020-09-03 08:50 GMT
'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టాడు కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలీ. ఆ తర్వాత నాగచైతన్యతో 'తడాఖా' సినిమా తెరకెక్కించాడు. అయితే ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుని అందరిని షాక్ కి గురి చేసాడు. పవన్ కళ్యాణ్ - డాలీ కాంబినేషన్ లో వచ్చిన 'గోపాల గోపాల' సినిమా మంచి విజయం సాధించింది. వెంటనే పవర్ స్టార్  సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు డాలీ. తమిళ్ హిట్ మూవీ 'వీరమ్' ని పవన్ తో 'కాటమరాయుడు' పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ కిషోర్ పార్థసాని మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వచ్చాయి.

కాగా 'కాట‌మ‌రాయుడు' సినిమా త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఏకంగా మూడేళ్లు డైరెక్ట‌ర్ డాలీ వెయిట్ చేశాడు. ఈ క్రమంలో జ‌న‌సేన పార్టీకి క్రియేటివ్ గా కావాల్సిన సహకారం కూడా అందించాడని తెలుస్తోంది. అప్పటి నుంచి ప‌వ‌న్ చుట్టూనే తిరిగాడు డాలీ. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో డాలీతో ఓ సినిమా ఉండబోతోందని న్యూస్ వచ్చింది. అయితే డాలీతో సినిమా చేస్తానంటూ ప‌వన్ కమిట్ అయిన‌ప్ప‌టికీ.. అతను చెప్పిన క‌థ‌లు పవర్ స్టార్ ని ఇంప్రెస్ చేయలేకపోయాట. అందుకే పవన్ కళ్యాణ్ డాలీని పక్కన పెట్టి హరీష్ శంకర్ - సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో అయినా పవన్ డాలీ కి మరో అవకాశం ఇస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News