వరల్డ్‌ ఛాంపియన్‌ బయోపిక్‌ హీరో ఇతడే

Update: 2020-12-15 12:30 GMT
ఇండియన్‌ చెస్‌ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చి పలు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ గా నిలిచిన విశ్వనాథ్‌ ఆనంద్‌ బయోపిక్‌ ను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేశాడు. విశ్వనాథ్‌ పాత్రకు ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటూ ఉండగా పలువురు హీరోల పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. ఎక్కువ శాతం మంది బాలీవుడ్‌ హీరోను విశ్వనాథ్‌ ఆనంద్‌ గా చూస్తామని భావించారు. కాని అనూహ్యంగా ఆ అవకాశంను సౌత్‌ స్టార్‌ కు దర్శకుడు ఇచ్చాడు.

విశ్వనాథ్‌ ఆనంద్ బయోపిక్‌ లో నటించాలంటూ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ను దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ సంప్రదించాడు అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే కథ చెప్పడంతో పాటు కీలక విషయాలను కూడా చర్చించారు అంటూ ప్రచారం జరుగుతోంది. ధనుష్‌ అయితే ఈ సినిమాను సౌత్‌ ఆడియన్స్‌ వద్దకు అలాగే ఉత్తరాది అభిమానుల వద్దకు తీసుకు వెళ్తాడు అంటున్నారు.

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ అయిన విశ్వనాథ్‌ ఆనంద్‌ జీవితాన్ని కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే వచ్చిన పలు బయోపిక్స్‌ లో చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మరింత విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News