పీకే26 పుకార్లకు చెక్ పెట్టిన దిల్ రాజు
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ 'పింక్' రీమేక్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు లాయర్ సాబ్.. ప్లీడర్ సాబ్ అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. సినిమా ఫస్ట్ లుక్ అదుగో.. టైటిల్ ఇదుగో అంటూ మీడియాలో వస్తున్న పుకార్లకు నిర్మాత దిల్ రాజు చెక్ పెట్టాడు. పుకార్ల కు తావు ఇవ్వకుండా సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ తో కలిపి ఉగాదికి మీ ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఇక సినిమాను సమ్మర్ కానుకగా మే 15న భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా ఆయన ప్రకటించాడు. పింక్ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ భారీ పారితోషికంను అందుకుంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా దిల్ రాజు కు పవన్ తో సినిమా చేయాలనేది డ్రీమ్. ఆ డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు కాస్త ఎక్కువ గానే ఈయన ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలున్నాయట. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం లో పవన్ తన 27వ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. తాను చేయబోతున్న దాదాపు అన్ని సినిమాలను కూడా కేవలం రెండు లేదా మూడు నెలల్లోనే పూర్తి చేయాలంటూ దర్శక నిర్మాతలకు పవన్ ముందుగానే సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.