• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బ్రాండ్ తో కొత్త...

మహేష్ బ్రాండ్ తో కొత్త హీరో

By - Tupaki Desk
Update: 2018-01-13 09:53 GMT
సినిమా కుటుంబాల నుంచి వారసుల పరంపర అన్ని బాషల్లోను ఉండేదే. టాలీవుడ్ దానికి అతీతం కాదు. ఒక్కో ఫ్యామిలీ నుంచి కనీసం ముగ్గురు హీరోలున్న నేపధ్యంలో ఈ మధ్య రాజకీయ నాయకుల వారసులు కూడా సినిమా వైపు యు టర్న్ తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య మంత్రి గంటా శ్రీనివాసరావు అబ్బాయి గంటా రవి హీరోగా జయదేవ్ అనే మూవీ తీస్తే అది డిజాస్టర్ అయ్యింది. దీంతో మరో సినిమా చేసే ఉద్దేశాన్ని అతను వాయిదా వేసుకున్నాడు. అంతకు ముందు కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ గౌడను జాగ్వార్ సినిమాతో లాంచ్ చేసారు. అదే రిజల్ట్ వచ్చింది. నిఖిల్ గౌడ కన్నడలో కంటిన్యూ అవుతున్నాడు కాని ఇంకా భారీ సక్సెస్ ఏది అందుకోలేదు. ఇప్పుడు మరో పొలిటీషియన్ అబ్బాయి ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది.

ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ అబ్బాయి అశోక్ గల్లా ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. దిల్ రాజు దీనికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. బెక్కెం వేణుగోపాల్ సహా నిర్మాత. ఈయన గతంలో సినిమా చూపిస్తా మావా, నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ నిర్మించారు.రచయిత హరి దీంతో డైరెక్టర్ గా లాంచ్ కాబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తైన ఈ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

అశోక్ గల్లా వ్యక్తిగత ఆసక్తి మీదనే ఈ సినిమా తీస్తున్నట్టు వార్త. కుర్రాడు మంచి గ్రేస్, గ్లామర్ తో ఉండటంతో నటన మరియు ఇతర కీలక అంశాలకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసారట. ఎలాగైనా నటుడిగా పేరు తెచ్చుకుని హీరోగా సెటిల్ కావాలనేది అశోక్ ప్లాన్ లా ఉందని తెలిసింది. మహేష్ మేనల్లుడు అనే బ్రాండ్ కొంతవరకే ఉపయోగపడుతుంది అనే విషయం దృష్టిలో పెట్టుకుని అశోక్ ని సోలోగా ఫోకస్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధం చేసారని టాక్. హీరొయిన్, టెక్నికల్ టీం తదితర వివరాలు ఇంకా ఫైనలైజ్ కావలసి ఉంది.
Tags:    
  • Dil Raju 
  • Galla ashok 
  • Tollywood 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS