వీవీ వినాయక్ పై అంత బడ్జెట్.. రిస్క్ కాదా?

Update: 2020-05-26 08:10 GMT
ఒక సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి అనే విషయం ఎప్పుడూ చర్చనీయాంశమే.  కథ ప్రకారం అని కొందరు వాదిస్తారు కానీ అలా చేస్తే ఎక్కువ సందర్భాలలో నిర్మాతకు నష్టాలు తప్పవు.   ప్రాక్టికల్ గా అయితే హీరో మార్కెట్.. దర్శకుడి సత్తాను బట్టే బడ్జెట్ పెట్టాలి. అలా కాకుండా తోచిన బడ్జెట్ పెట్టేస్తే వెనక్కు రాకపోవచ్చు. ఎవరు ఎన్ని లాజిక్కులు చెప్పినా కొన్ని సినిమాలు ఓవర్ బడ్జెట్ అవుతాయి.  వీ.వీ. వినాయక్ హీరోగా పరిచయం అయ్యే సినిమా బడ్జెట్ అలాగే ఎక్కువైందని అంటున్నారు.

దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్లు అందించిన వీవీ వినాయక్ కెరీర్ గత కొంతకాలంగా నెమ్మదించింది.  'ఇంటెలిజెంట్' పరాజయంతో పెద్ద హీరోలు ఎవరూ వినాయక్ తో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వినాయక్ డైరెక్షన్ ను పక్కనబెట్టి హీరో అవతారమెత్తారు.  దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న 'సీనయ్య' సినిమాతో హీరోగా అదృష్టం పరిక్షించుకుంటున్నారు.  ఈ సినిమాకు పది కోట్లు బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఈమధ్య కొందరు మిడ్ రేంజ్ హీరోలు కూడా పది కోట్ల మార్క్ కలెక్షన్లు టచ్ ఆపసోపాలు పడుతున్నారు. అలాంటిది వినాయక్ ను పైన పది కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద రిస్క్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యువ హీరో అయితే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది కానీ మిడిల్ ఏజ్ లో ఉన్న వినాయక్ ను స్క్రీన్ పై చూస్తారా అనేది సందేహమే. మరి ఏ ధైర్యంతో దిల్ రాజు ఇంత బడ్జెట్ పెట్టారో ఏమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.  మరి వినాయక్ హీరోగా ఆ పెట్టుబడి వెనక్కు తీసుకురాగలడా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News