• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు ఘనకీర్తి...

దిల్ రాజు ఘనకీర్తి గతమేనా..?

By - Tupaki Desk
Update: 2019-10-10 14:30 GMT
ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే విజయానికి ఓ చిరునామా అన్నట్టుగా ఉండేది.  డిస్ట్రిబ్యూషన్ అయినా.. నిర్మాణం అయినా దిల్ రాజు టేకప్ చేసిన ప్రాజెక్టు హిట్టే అని అటు ట్రేడ్ వర్గాలవారు ఇటు ప్రేక్షకులు నమ్మేవారు. అయితే గత కొంత కాలంగా దిల్ రాజు బ్రాండుకు డ్యామేజ్ జరుగుతోంది. అప్పట్లో  'శ్రీనివాసకళ్యాణం' సినిమా గురించి దిల్ రాజు చేసిన ప్రమోషన్ ను చూసిన వారు అది ఎపిక్ ఫిలిం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా చూసినవారికి నోటమాట రాలేదు.  నిజానికి అప్పటి నుంచి దిల్ రాజు మాటలపై ప్రేక్షకులకు నమ్మకం సడలిపోవడం ప్రారంభమైంది.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'F2' ఒక్కటే ఆయన ఖాతాలో జెన్యూన్ హిట్టు.  ఆ సినిమా కాకుండా ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచినవే. ఇవే కాకుండా చిన్న సినిమాలతో అసోసియేట్ అయితే ఆ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. దిల్ రాజు ఈమధ్య ప్రెజెంట్ చేసిన చిన్న సినిమా 'ఎవ్వరికీ చెప్పొద్దు'.. అయితే ఆ సినిమా అసలు రిలీజ్ అయిన సంగతి చాలామందికి తెలియదు.. అది రాజుగారి సినిమా అని ప్రేక్షకులు గుర్తించలేదు అంటే అంతకంటే షాకింగ్ అంశం మరోటి ఉండదు. పోస్టర్ పై దిల్ రాజు పేరు ఉంటే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాకు వెళ్ళేవారు.. ఇప్పుడు ఆయన ప్రెజెంట్ చేస్తున్న సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలియడం లేదంటే ఏమనుకోవాలి? ఈ సినిమానే అనుకుంటే దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్న మరో సినిమా రవిబాబు 'ఆవిరి' టీజర్లు కూడా ప్రేక్షకులను హడలకొడుతున్నాయి..హర్రర్ సీన్స్ తో కాదు ఔట్ డేటెడ్ కంటెంట్ తో.

రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాల పరిస్థితి కూడా నిరాశాజనకంగానే ఉంది.  మరి రాజుగారు తన రూటు మార్చి తన కెరీర్ మొదట్లో చేసిన విధంగా అద్భుతమైన సినిమాలతో మెప్పిస్తారా లేదా ఇక అది గతం అని సరిపెట్టుకోవాల్సిందేనా?..  ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొంతకాలం మనం వేచి చూడకతప్పదు. సినిమాల విషయం ఇలా ఉంటే దిల్ రాజు గతంలో చాలా థియేటర్లకు చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ల సమయం పూర్తవుతోందని సమాచారం.  మరి ఆ అగ్రిమెంట్ల విషయంలో రాజుగారు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
Tags:    
  • Dil Raju 
  • Telugu Film Industry 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS