• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబ్బుకు ఆశ పడని నానికి...

డబ్బుకు ఆశ పడని నానికి హ్యాట్సాఫ్

By - Tupaki Desk
Update: 2019-04-23 05:45 GMT
నాని హీరోగా నటించిన 'జర్సీ' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు - భారీగా వసూళ్లను రాబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులను అభినందించేందుకు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రత్యేకంగా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి సినిమాలు వచ్చిన సమయంలో వాటిని అభినందించడం దిల్‌ రాజుకు ఉన్న మంచి అలవాటు. తాజాగా జర్సీ చిత్రం వంటి ఒక గొప్ప సినిమాను తీసినందుకు - చేసినందుకు - నిర్మించినందుకు దర్శకుడు - హీరో - నిర్మాతపై దిల్‌ రాజు ప్రశంసలు కురిపించాడు.

ఈ సందర్బంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తాయి - అందులో కొన్ని సక్సెస్‌ అవుతాయి, అయితే సక్సెస్‌ అయిన సినిమాల్లో కూడా కొన్ని మాత్రమే గుండెకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటి సినిమా జెర్సీ. ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు నేను చూశాను. అప్పుడు నేను ఎలా ఫీల్‌ అయ్యానో విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా అలా ఫీల్‌ అవుతున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం ఉన్న దర్శకుడు ఇలాంటి సినిమాను తీయడం గ్రేట్‌. భార్య భర్తల మద్య డైలాగ్స్‌ లేకుండా వారి ఎమోషన్‌ ను చూపించడం అద్బుతంగా అనిపించింది. తాను అనుకున్న కంటెంట్‌ ను అద్బుతంగా ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడు గౌతమ్‌ పూర్తి సక్సెస్‌ అయ్యాడు. ఇంత పెద్ద విజయంకు ఫస్ట్‌ క్రెడిట్‌ దర్శకుడికే దక్కుతుంది అన్నాడు.

ఇక ఈ చిత్రంలో నటించిన నానిని ఎంత అభినందించినా తక్కువే. సహజ నటుడిగా పేరు దక్కించుకున్న నాని ఒక గొప్ప నటుడు అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. నాని నటించిన సినిమా ఆడినా ఆడకున్నా అందులో అతడి సహజ నటన మాత్రం కనిపిస్తుంది. నాని డిమాండ్‌ చేస్తే ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అలాంటిది నాని ఈ చిత్రంను పారితోషికం తీసుకోకుండా చేసేందుకు ముందుకు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. అతడి డెడికేషన్‌ కు నాకు కన్నీళ్లు వచ్చాయి. సినిమాపై అతడికి ఉన్న నమ్మకం అలాంటిది. హీరో డబ్బుకు ఆశ పడకుండా మంచి కథలను ఎంచుకుని ఇలాంటి సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. హీరోలు పారితోషికంకు ఆశ పడకుంటేనే ఇలాంటి అద్బుతమైన సినిమాలు వస్తాయి. నిజంగా నానికి ఈ విషయంలో హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే, ఇలాంటి ఒక కథను నమ్మి - సినిమా చేసినందుకు నానికి థ్యాంక్స్‌ చెప్పకుండా ఉండలేక పోతున్నాను. చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా దిల్‌ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు.
Tags:    
  • Dil Raju 
  • Nani 
  • Jersey Movie Success Meet 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS