రాజు గారే రాజని అనిపించుకున్నారు

Update: 2017-01-23 07:09 GMT
ఇప్పుడు ఒక టాపిక్‌ ఫిలిం నగర్లో నానా హడావుడి చేస్తోంది. అసలు డెసిషన్ మేకింగ్ విషయంలో దిల్ రాజు టాలెంట్ ఏంటి అనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనవి చాలా సినిమాలు ఫ్లాపయ్యాయ్. కాబట్టి చాలామంది యంగ్ హీరోలు ఆయన జడ్జిమెంటల్ స్కిల్స్ సన్నగిల్లాయ్ అనుకున్నారు. కాని ఒక్కోసారి మాత్రం ఆయనే కరక్ట్ అనిపిస్తోంది సినిమా జనాలకు.

మొన్నటికి మొన్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. రాజు గారు కూర్చిన శతమానం భవతి నుండి వాకౌట్ చేశాడు. ఆ తరువాత మరో ఇద్దరు కుర్ర హీరోలు కూడా ఆ ప్రాజెక్టును కాదనుకున్నారు. కట్ చేస్తే శర్వానంద్ ఒక్కడే ఆ సినిమాను ఒప్పుకున్నాడు. అయితే కేవలం రాజు గారి జడ్జిమెంట్ పైన ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను చేశానని ఈ యంగ్ హీరో సెలవిచ్చేశాడు. నిజానికి విమర్శకులు యావరేజ్ గా ఉందన్నా కూడా.. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేసే సినిమాగా శతమానం భవతి ఇరగదీసింది. అమెరికాలో కూడా బాగానే ఆడేస్తోంది. రాజు గారి ప్లానింగ్ అనండి.. లేదంటే ఆయన ధియేటర్లలో సినిమాను పొజిషనింగ్ చేసిన తీరు అనండి.. అలాగే ఆయన ఎంచుకున్న కథాంశం.. దర్శకుడితో పని చేయించుకున్న విధానం.. గ్లామరసం చిందించకపోయినా నటనతో ఆకట్టుకునే హీరోయిన్ ను తీసుకున్న తీరు.. ఇలా అన్ని విషయాల్లోనూ మన యంగ్ హీరోలకంటే ఆయనే ముదురు అనే విషయం స్పష్టం అయిపోయింది.

ఇప్పుడు ఇక పెద్ద సినిమాలైన అల్లు అర్జున్ 'డిజె దువ్వాడ జగన్నాథమ్'.. వరుణ్‌ తేజ్‌ 'ఫిదా'.. అలాగే మహేష్‌ తో వంశీ పైడిపల్లి సినిమా.. మొదలగు సినిమాలు కూడా భారీ సక్సెస్ కొడితే మాత్రం.. జడ్జిమెంట్ విషయంలో రాజుగారే రాజు అని మనం ఒప్పుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News