సంక్రాంతి సీజన్ పై కూడా దిల్ రాజు నమ్మకం పెట్టుకోలేదా?
టాలీవుడ్ నిర్మాతల్లో బాక్సాఫీస్ విశ్లేషణపై బాగా పట్టున్న నిర్మాత దిల్ రాజు అనడంలో సందేహం లేదు. ఆయన ఏ సినిమా ఏ సమయంలో విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగలదు అనే విషయాలను చక్కగా విశ్లేషించగలడు. ఆయన నిర్మాణంలో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి టైంకు విడుదల చేయడం వల్ల సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేవి. కాని కరోనా కారణంగా ఆయన నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా విడుదల తేదీ విషయంలో ఒక అంచనాకు రాలేక పోతున్నాడు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా అప్పటి వరకు థియేటర్లు ఏ మేరకు రన్ అవుతాయి అనేది తెలియని పరిస్థితి.
నవంబర్ లో అనుకున్న థియేటర్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు డిసెంబర్ కు వాయిదా వేశారు. డిసెంబర్ లో థియేటర్లు ప్రారంభం అయినా ప్రేక్షకులు ఎంత వరకు వస్తారు అనేది తెలియడం లేదు. వ్యాక్సన్ రాకుండా జనాలు థియేటర్లకు వస్తారు అనుకోవడం పొరపాటు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపినా కూడా ఆ 50 శాతం సీట్లు కూడా ఫిల్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు. దిల్ రాజు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు అనే చర్చ జరుగుతోంది. దిల్ రాజు ప్రస్తుతం వకీల్ సాబ్ కాకుండా పెద్ద సినిమాల నిర్మాణం జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే థియేటర్లు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో ఎప్పటి వరకు నడిచేది తెలియడం లేదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా పెద్ద సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సినిమాలను మొదలు పెట్టడం ప్రకటించడం వంటివి చేసినా కూడా విడుదల విషయంలో మాత్రం 2021 ద్వితీయార్థంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వకీల్ సాబ్ ను సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కాని థియేటర్ల విషయంలో ఉన్న సస్పెన్స్ కారణంగా దిల్ రాజు నమ్మకంగా వకీల్ సాబ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేక పోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. దిల్ రాజు సంక్రాంతి సీజన్ కు కూడా థియేటర్లు నడవక పోవచ్చు అనే నమ్మకంతో ఉన్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్న కారణంగా ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా ఆలోచనల్లో పడే అవకాశం ఉందనిపిస్తుంది.