ఎఫ్‌3 ని మార్చిన దిల్ రాజు

Update: 2020-12-24 05:30 GMT
గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ఎఫ్‌ 2 సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ సమయంలోనే ఎఫ్‌ 3 ని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. మహేష్‌ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించిన అనీల్ రావిపూడి స్థాయి మరింతగా పెరిగింది. దాంతో ఎఫ్‌ 3 ని మరింత భారీగా చేయాలని అనీల్‌ భావించాడు. అందుకు మరో హీరోను కూడా నటింపజేయాలని ఆశించాడట. ఎఫ్‌ 3 లో మహేష్ బాబును చిన్న పాత్ర కోసం అయినా ఒప్పించాలని అనీల్‌ తీవ్రంగానే ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. కాని ముగ్గురు హీరోల్లో ఒక్క హీరోగా నటించడం ఇష్టం లేదన్నట్లుగా మీడియా వర్గాల టాక్‌. మహేష్ నో చెప్పడంతో మరో హీరోతో ప్లాన్‌ చేస్తున్న అనీల్ కు దిల్‌ రాజు నుండి వ్యతిరేకత వచ్చిందట.

ఎఫ్‌ 3 సినిమాలో మరో హీరో నటించడం వల్ల అదనపు బడ్జెట్‌ మరియు అదనపు అంచనాలు ఉంటాయి. కనుక వాటిని రీచ్‌ అయ్యే విషయంలో అటు ఇటు అయితే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే రిస్క్‌ లేకుండా ప్రయోగం చేయకుండా ఆ ఇద్దరితోనే సినిమాను పూర్తి చేయమని అనీల్‌ కు దిల్‌ రాజు సూచించాడట. దాంతో తాను మొదట అనుకున్న కథను కాకుండా ఇద్దరు హీరోలకు అనుగుణంగా మార్చి సినిమాను పట్టాలెక్కించాడు. నిన్నటి నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. వచ్చే దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎఫ్‌ 3 సక్సెస్‌ అయితే ఎఫ్‌ 4 కూడా ఉంటుందా అంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News