టాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటైన విలన్ దొరికేసాడా..??

Update: 2021-01-15 12:30 GMT
తాజాగా సంక్రాంతి సందర్బంగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమాలో హీరో విజయ్ కంటే విలన్ క్యారెక్టర్ పోషించిన విజయ్ సేతుపతికి ఎక్కువగా మార్కులు పడుతున్నాయి. మొదటి నుండి కూడా విజయ్ సేతుపతి హీరో పాత్రలే చేయాలనీ పట్టుబట్టకుండా ఏదైనా మంచి పాత్ర దొరికితే చాలు అంటూ ఓకే చెప్పేస్తున్నాడు. హీరోగా కాకుండా సేతుపతి ఒక నటుడుగా తను మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా మాస్టర్ విలన్ రోల్ లో విజయ్ భీభత్సం సృష్టించాడనే చెప్పాలి. ఎందుకంటే మాస్టర్ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే అందులో హీరో తర్వాత విలన్ హైలైట్ అనవచ్చు. అంతలా తన ప్రతిభ కనబరిచాడు విజయ్.

అయితే తెలుగులో డబ్బింగ్ సినిమాగా విడుదలైన మాస్టర్.. చూసినవారంతా టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడని భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో తెలుగులో విలన్ గా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక తెలుగు హీరోలకు ధీటుగా విలన్ పాత్రలకు విజయ్ సెట్ అవుతాడని అంటున్నాయి సినీవర్గాలు. మరి పాత్ర నచ్చితే ఓకే చెప్పే విజయ్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. మరి ఉప్పెన విలన్ విజయ్ ని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎలా వాడుకుంటారో చూడాలి. మరి టాలీవుడ్ స్టార్ విలన్ గా మక్కల్ సెల్వన్ నటిస్తాడా లేదా అనేది ప్రశ్న. ఇదిలా ఉండగా.. తెలుగు డబ్బింగ్ సినిమా పిజ్జాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విజయ్ సేతుపతి. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో విజయ్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోగా మాత్రం వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో 'లాభం' ఒకటి. ఈ సినిమాలో విజయ్ సంఘసేవకుడిగా కనిపించబోతున్నాడు. అలాగే త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు.
Tags:    

Similar News