'పుష్ప‌' ఆ ప్ర‌మాదం నుంచి గ‌ట్టెక్కేనా?

Update: 2021-12-21 11:32 GMT
బ‌న్నీ నటించిన `పుష్ప ది రైజ్‌` పేరుకు త‌గ్గ‌ట్టే ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తోంది. విడుద‌లైన‌ రోజు నుంచి తొలి మూడు రోజులు భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది.

బ‌న్నీ న‌ట‌న‌, సుకుమార్ టేకింగ్‌, దేవీ అందించిన సాంగ్స్ సినిమాని ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యేలా చేశాయి. అయితే ఎంత జోరు చూపించినా మండే రోజు మాత్రం `పుష్ప` త‌డ‌బ‌డిన‌ట్టుగానే క‌నిపించింది. క‌లెక్ష‌న్ ల ప‌రంగా పెద్ద‌గా తేడా క‌నిపించ‌క‌పోయినా కొంత భ‌యాన్ని మాత్రం క‌లిగించింద‌ని చెబుతున్నారు.

కార‌ణం ఈ సినిమాకి భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టారు. ఇలా అయితే అది రిక‌వ‌రీ అయ్యేనా అన్న‌ది డిస్ట్రీ బ్యూట‌ర్ల భ‌యం. మండే రోజు క‌లెక్ష‌న్ల‌ని ప‌రిశీలించిన పంపిణీదారులు కొంత భ‌యానికి లోన‌య్యార‌ట‌.

ఇదిలా వుంటే ఓవ‌ర్సీస్ లో పెట్టిన పెట్టుబ‌డి 50 శాతం వ‌చ్చేసింద‌ని, మ‌రో 50 శాతం రాబ‌ట్టిన త‌రువాతే లాభాల గురించి ఆలోచించాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న `శ్యామ్ సింగ రాయ్‌` చిత్రం `పుష్ప‌` క‌లెక్ష‌న్ ల‌పై గ‌ట్టి ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నాని కెరీర్ లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న `శ్యామ్ సింగ రాయ్‌` రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్ట‌డం ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ మూవీ భారీ స్థాయిలో అత్య‌ధిక స్క్రీన్ ల‌లో విడుద‌ల కాబోతోంది. దీని కార‌ణంగా `పుష్ప‌` థియేట‌ర్లు, స్క్రీన్‌లు అనూహ్యంగా త‌గ్గే అవ‌కాశం వుంది. అంతే కాకుండా కొత్త సినిమా కావ‌డంతో ఆడియ్స్ `పుష్ప‌`ని ప‌క్క‌న పెట్టి `శ్యామ్ సింగ రాయ్‌`కి ప్ర‌ధాన్య‌త‌నిచ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

అంతే కాకుండా నాని సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ని గ‌న‌క ద‌క్కించుకుంటే అదే `పుష్ప‌`కు ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించే అవకాశం వుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమా థ‌యేట్రిక‌ల్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

పైగా సాయి ప‌ల్ల‌వి, బేబమ్మ ఇద్ద‌రూ ఒకే సినిమాలో వుండ‌టం కూడా `శ్యామ్ సింగ రాయ్‌` కి మ‌రో ప్ల‌స్ పాయింట్ గా మార‌బోతోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో `శ్యామ్ సింగ రాయ్‌` రూపంలో పొంచి వున్న ప్ర‌మాదం నుంచి `పుష్ప‌` గ‌ట్టెక్కేనా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీలో టికెట్ ల ధ‌ర‌లు ఇప్ప‌టికే భారీ న‌ష్టాన్ని క‌లిగించ‌గా `శ్యామ్ సింగ రాయ్‌` మ‌రిత న‌ష్టాల‌ని అందింది `పుష్ప‌`కు డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుందా అన్న‌ది తెలియాలంటే ఈ నెల 24 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News