మెగాప్రిన్స్ మరో దర్శకుడికి ఓకే చెప్పాడా..??

Update: 2021-06-09 03:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ హీరోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మెగా హీరోల నుండి ఎలాంటి అప్డేట్స్ వినిపించినా అభిమానులకు ట్రీట్ అవుతుంది. అయితే మెగాహీరోలలో రోజురోజుకి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. గత కొన్నేళ్లుగా వరుణ్ సినీ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే వరుణ్ నటించిన గత సినిమాలు గమనిస్తే అర్ధమవుతుంది. ఎలాంటి తొందర పడకుండా నిదానంగానే ఒక్కో సినిమా చేస్తూ పోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ చేతిలో గని, ఎఫ్3 సినిమాలున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు.

బాక్సింగ్ నేపథ్యం కాబట్టి ఆల్రెడీ సినిమాకోసం ఫారెన్ లో మెలకువలు నేర్చుకొని వచ్చాడు వరుణ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశలో ఉంది. జులై 30న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదాపడే అవకాశం ఉంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఎఫ్3 సినిమా కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఈ సినిమాను ఆగష్టు 27న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే వరుణ్ మరో సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది.

ఈ మధ్యకాలంలో కామెడీ ఒరియంటెడ్ సినిమాలు తెరకెక్కించే దర్శకులు తక్కువమంది ఉన్నారు. వారిలో త్రినాథరావు నక్కిన ఒకరు. ఇంతకుముందు త్రినాథరావు ‘సినిమా చూపిస్తమావ’ ‘నేను లోకల్’ సినిమాలను హిట్ చేశాడు. అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వరుణ్ తో ఓ సినిమా లైన్ చేస్తున్నాడట. ఇటీవల కాలంలో లైట్ హార్టెడ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్లు తెరకెక్కించడంలో త్రినాధరావు నక్కిన సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగాహీరోతో సినిమా అంటే కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు మెగాఫ్యాన్స్. మొన్నటివరకు త్రినాథరావు రవితేజతో సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది. మరి ఏమైందో కానీ ఇప్పుడు మెగాహీరో వైపు మళ్ళినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రానుందేమో.!
Tags:    

Similar News