'ఆర్ ఆర్ ఆర్'కి ఆ స్టార్ హీరోయిన్ అందుబాటులో ఉంటుందా..?
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. స్టార్ హీరోలు రాంచరణ్ - ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆయనకు తోడుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభిస్తారట. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. ఇక ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.
ప్రస్తుతం బాలీవుడ్ బిజీ యాక్ట్రెస్ లలో అలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అన్నీ పెద్ద ప్రాజెక్టులే ఉన్నట్లు సమాచారం. ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్ తో డేట్స్ ఇచ్చిన అలియా భట్.. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి తంటాలు పడుతుందట. కరోనా కారణంగా వాయిదా పడ్డ పూణే షెడ్యూల్ వచ్చే నెల నుండి జరగనున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో అలియా భట్ అందుబాటులో ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో ఒలీవియా మారిస్ ని కథానాయికగా ఎంపిక చేసిన విషయం విదితమే. ఇక అలియా పార్టుని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని చూస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం అలియా చేతిలో బ్రహ్మాస్త్ర - సడక్ 2 - తఖ్త్ - గంగూభాయ్ కత్వాడియా చిత్రాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ అలియా డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.