సరైనోడు రూట్లో వెళుతున్న ధృవ

Update: 2016-10-28 11:30 GMT
ఒక సినిమాను జనాల్లోకి విపరీతంగా తీసుకెళితేనే అది హిట్టయ్యి విపరీతమైన కలక్షన్లను తెస్తుంది. థ్యాంక్స్ టు బాహుబలి.. ఆ మార్కెటింగ్ టెక్నికల్ లు ఇప్పుడు అందరికీ తెలిసిపోయాయ్. అయితే అలా జనాల్లోకి తీసుకెళ్లాలంటే అది భారీ ఖర్చుతో కూడిన పని. దానిని కేవలం పెద్ద సినిమాలు మాత్రమే సమర్ధవంతంగా చేయగలవు.

ఆ మధ్యన తమన్ మ్యూజిక్ తో సర్ ర్ ర్ అంటూ ఒక టీజర్ వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాంలేండి. అదే 'సరైనోడు' సినిమా టీజర్. కేవలం టివిల్లో చూపించడం.. ఇంటర్నెట్లో రిలీజ్ చేయడమే కాకుండా.. మనోళ్లు ఏకంగా 1000 ధియేటర్లలో టీజర్ స్ర్కీనింగ్ చేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే డిజిటల్ ఫార్మాట్ లో సినిమాను స్ర్కీన్ చేసే కంపెనీ తనకు డబ్బులు చెల్లిస్తేనే అలా స్ర్కీనింగ్ చేస్తారు. ఇకపోతే ఇప్పుడు రామ్ చరణ్‌ ధృవ సినిమాకు కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. ఈ రెండు సినిమాలకు నిర్మాత గీతా ఆర్ట్స్ వారే కాబట్టి.. అదే పద్దతిని ఇక్కడ కూడా దించేస్తున్నారనమాట.

ఇవాళ రిలీజైన కాష్మోరా సినిమా ధియేటర్లలో ఇంటర్వెల్ లో ''ధృవ'' సినిమా టీజర్ ను స్ర్కీన్ చేయడంతో ప్రభంజనం మొదలైందని చెప్పొచ్చు. అలాగే రేపు రిలీజయ్యే ధనుష్‌ ధర్మయోగి సినిమాలో ఇదే విధంగా ధృవ టీజర్ ఎటాచ్ చేస్తారట. ఆ లెక్కన సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఒక 75+ కోట్లు మినిమం షేర్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనమాట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News