కొత్త సినిమా.. డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజు ఎంబీబీఎస్‌

Update: 2016-11-14 22:30 GMT
ఎం.ధ‌ర్మ‌రాజు ఎంఏ.. మోహ‌న్ బాబు న‌టించిన ఓ వైవిధ్య‌మైన సినిమా. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌.. చిరంజీవి న‌టించిన సూప‌ర్ హిట్ ఎంట‌ర్టైన‌ర్. ఈ రెండు టైటిళ్ల‌నూ క‌లిపి ఓ కొత్త సినిమాకు ‘డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజు ఎంబీబీఎస్‘ అని పేరు పెట్టేశారు. ఐతే ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కాదు.  త‌మిళ డ‌బ్బింగ్ మూవీ. విజ‌య్ సేతుప‌తి.. త‌మ‌న్నా జంట‌గా న‌టించిన త‌మిళ సినిమా ‘ధ‌ర్మ‌దురై‘ని ‘డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజు ఎంబీబీఎస్‘ పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. మూడు నెల‌ల కింద‌ట‌.. ఆగ‌స్టులో విడుద‌లైన ‘ధ‌ర్మ‌దురై‘ త‌మిళంలో మంచి విజ‌యం సాధించింది. ఇది విజ‌య్ సేతుప‌తికి వ‌రుస‌గా నాలుగో హిట్టు కావ‌డం విశేషం.

తెలుగులో ‘పిజ్జా‘ సినిమా ద్వారా విజ‌య్ సేతుప‌తి మంచి గుర్తింపే సాధించినా.. ఆ త‌ర్వాత అత‌డి అనువాద చిత్రాలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. చివ‌ర‌గా ‘నేను రౌడీనే‘తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు సేతుప‌తి. ‘డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజు ఎంబీబీఎస్‌‘లో త‌మ‌న్నా క‌థానాయిక కావ‌డం క‌లిసొచ్చేదే. త‌మ‌న్నాది ఇందులో టీచ‌ర్ పాత్ర‌. సినిమా అంత‌టా చీర‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తుంది త‌మ‌న్నా. సుధ సినిమాస్ బేన‌ర్ మీద సాంబ‌శివ‌రావు తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నాడు.  ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత ద‌ర్శ‌కుడు. త‌మ‌న్నా ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తే బాగుంటుంది కానీ.. త‌మిళంలోనే ఆమె ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు. ఈ విష‌యంలో ఆమెపై నిర్మాత‌ల మండ‌లికి కంప్లైంట్ కూడా వెళ్లింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News