ప‌వ‌న్ తో ధ‌నుష్ యుద్ధం.. పై చేయి ఎవ‌రిదో..?

Update: 2021-02-15 00:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్రేక్ష‌కులు తెర‌పై చూసి మూడు సంవ‌త్స‌రాలు దాటింది. ఇంత గ్యాప్ త‌ర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో వస్తున్నాడు పవన్. ఈ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ మూవీని సమ్మర్ బరిలోకి దింపబోతున్న మేకర్స్.. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న థియేటర్లలో మోత మోగించబోతున్నాడు వకీల్ సాబ్.

అయితే.. ఇదే రోజున నేను కూడా వచ్చేస్తున్నా అంటున్నాడు తమిళ్ స్టార్ ధనుష్! ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ ‘కర్ణన్’. సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 9న విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది యూనిట్‌. డేట్ కూడా అనౌన్స్ చేసేశారు.

న్యాయం కోసం ఏడు‌స్తున్న‌ అభాగ్యుల ప‌క్షాన వాదించే లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపిస్తుండ‌గా.. 1995 లో తమిళనాడులో జరిగిన య‌థార్థ సంఘ‌ట‌నల‌కు ప్ర‌తిరూపంగా ధ‌నుష్ సినిమా నిల‌వ‌బోతోంది. అయితే.. ప‌వ‌న్ సినిమా రోజునే ధ‌నుష్ సినిమా కూడా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే.. భారీ హైప్ మ‌ధ్య వ‌స్తున్న ప‌వ‌న్ సినిమాతో ధ‌నుష్ సినిమా ఏమాత్రం పోటీ ప‌డుతుందో అనే చ‌ర్చ సాగుతోంది.




Tags:    

Similar News