• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘గోల్డెన్ గ్లోబ్’లో...

‘గోల్డెన్ గ్లోబ్’లో ధనుష్, సూర్య చిత్రాలు.. అరుదైన గౌరవం

By - Tupaki Desk
Update: 2020-12-21 08:10 GMT
‘అసురన్, సూరారై పొట్రు..’ తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఇటీవల వచ్చిన అద్బుతమైన చిత్రాలివి. ఈ రెంటికీ ప్రేక్షకులు నీరాజనం పలికారు. సమాజంలో వేళ్లూనుకున్న కులాన్ని, దానిమాటున కొనసాగుతున్న నిరంకుశత్వాన్ని ‘అసురన్’ నిలదీస్తే.. విమాన ప్రయాణాన్ని డబ్బున్న వాడికే పరిమితం చేయడం వెనుక కుట్రల్ని ప్రశ్నించింది ‘సూరారై పొట్రు’. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలు.. మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకున్నాయి.

గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో ప్రదర్శన..
ఈ రెండు సినిమాలు పేరు పరంగానే కాకుండా.. వాణిజ్యపరంగా కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. ప్రజల జీవితానికి సంబంధించిన కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రాల ఖ్యాతి విదేశాల వరకూ విస్తరించింది. అందుకే వీటికి అరుదైన గౌరవం దక్కింది. ఈ రెండు సినిమాలను 78వ ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జనవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో ఈ రెండు తమిళ సినిమాలు ఎంపికయ్యాయి.

అసురన్ మూవీ 2019లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ మూవీని వెట్రి మారన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ధనుష్ తన పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

ఇక సూర్య చేసిన ‘సూరారై పొట్రు’ చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ‘అమెజాన్ ప్రైమ్’ ద్వారా విడుదలైన ఈ సినిమా.. అన్ని వర్గాలనుంచీ విశేష ఆదరణ పొందింది. సింగిల్ లైన్ కంటెంట్ తో సుధా కొంగర ఈ చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించారు. తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైన ఈ సినిమా.. ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలకూ జీవీ ప్రకాష్ సంగీతం అందజేశారు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS