• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తన లవ్ స్టోరీ బయటపెట్టిన...

తన లవ్ స్టోరీ బయటపెట్టిన స్టార్ హీరో!

By - Tupaki Desk
Update: 2020-05-08 03:45 GMT
కోలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస హిట్లతో ధనుష్ సృష్టిస్తున్న రచ్చ మాములుది కాదు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ కాన్సెప్టులతో స్టార్ హీరోగా ఎదిగిన తీరు అభినందనీయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ధనుష్ సొంతం. ఇండియన్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన పేరు అడ్డుపెట్టుకోకుండా సొంతంగా ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పరచుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు ధనుష్. నటుడిగా.. నిర్మాతగా.. సింగర్ గా.. దర్శకుడిగా.. మల్టీ టాలెంటెడ్ ధనుష్ వరుస విజయాలతో అభిమానులను అలరిస్తున్నారు. ధనుష్ ఆ మధ్య కామెడీ నైట్స్ కపిల్ షోలో పాల్గొని ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి వెనుక కథను చెప్పేసాడు.
 
రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో పరిచయం గురించి చెబుతూ.. నటుడిగా కెరీర్ మొదలైనప్పుడు యాక్టింగ్ పైనే ఫోకస్ చేశాను. ఆ సమయంలోనే ఐశ్యర్యతో పరిచయం అయింది. ఫస్ట్ లో తను పెద్దగా పట్టించుకోలేదు. నా ప్రయత్నాలన్నీ కెరీర్‌పై ఉండటంతో లవ్ మ్యాటర్ గురించి ఆలోచించలేదు. నా రెండో సినిమా కాదల్ కొండై సినిమా మార్నింగ్‌ షో చూడటానికి ఐశ్వర్య వచ్చింది. ఆ సమయంలో మరోసారి కలిసి.. సినిమా చూసి నీ యాక్టింగ్ బాగుందని చెప్పింది. ఆ తర్వాత వెళ్లిపోయేటప్పుడు ఐశ్వర్య నాతో టచ్ లో ఉండమని చెప్పింది. ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరికి చేర్చింది. అలా ఐశ్వర్య చెప్పిన టచ్ లో ఉండు అన్న మాటతో మా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి చేసింది. మా రెండు కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించడంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. అలా ఐశ్వర్య రజినీకాంత్ కాస్తా ఐశ్వర్య ధనుష్ అయిందని ధనుష్ చెప్పాడు. నా కెరీర్‌లో ఐశ్వర్య పాత్ర ఎంతో ఉంది. ఆమెతోనే నా ప్రయాణం సాఫీగా సాగుతుందని భార్య మీద ప్రేమను వెలిబుచ్చాడు.
Tags:    
  • Dhanush And Aishwarya Rajinikanth Love Story 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS