• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాజీ జంట మళ్లీ...

మాజీ జంట మళ్లీ కలుస్తున్నారనే వార్తల్లో నిజం లేదట..!

By - Tupaki Desk
Update: 2022-10-09 03:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే మాజీ జంట తిరిగి ఒకటవుతున్నట్లు గత రెండు మూడు రోజులుగా నెట్టింట వార్తలు ప్రచారం అవుతున్నాయి.

విడిపోతున్నట్లు ప్రకటించిన ఎనిమిదిన్నర నెలల తర్వాత ధనుష్ - ఐశ్వర్య ఇద్దరూ మళ్లీ రాజీపడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇది కుటుంబాలు రజనీకాంత్ నివాసంలో సమావేశమయ్యాయని.. చర్చలు జరిపి వారిద్దరి మధ్య సమస్యలను పరిష్కరించుకున్నారని నివేదించారు. ఈ క్రమంలో విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు.

దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లే తప్ప, మరేమీ కాదని సన్నిహిత వర్గాలు చెప్పినట్లుగా ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్య మరియు ధనుష్‌ జంట మళ్లీ ఒకరినొకరు కలవాలని అనుకోవడం లేదని.. అయితే పిల్లల బాధ్యతలను పంచుకోవడం గురించి మాత్రమే చర్చించుకున్నారని వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.

మాజీ సెలబ్రిటీ కపుల్ అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకోనప్పటికీ.. వారు ఏ విధంగానూ తిరిగి కలుసుకోవాలని అనుకోవడం లేదట. ఇటీవల కాలంలో చాలా మంది స్టార్స్ ఒక ప్రకటనతో విడిపోతున్నారు కానీ.. వాస్తవానికి చట్టపరమైన ప్రక్రియ ద్వారా అధికారికంగా విడాకులు తీసుకోవడం లేదు. ఇప్పుడు ధనుష్ - ఐశ్వర్య కూడా అలానే వేర్వేరు మార్గాల్లో జీవించనున్నారని అంటున్నారు.

కాగా, ధనుష్ మరియు ఐశ్వర్య కొన్నేళ్లపాటు ప్రేమించుకొని 2004 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే 18 ఏళ్ల దాంపత్య జీవితం గడిపిన తర్వాత విడిపోతున్నట్లుగా ఈ ఏడాది జనవరి 27న ధనుష్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్ నోట్ లో పేర్కొన్నారు.

ధనుష్ - ఐష్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఐశ్వర్య తన ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. అప్పటి నుంచీ ఒకరికొకరు దూరంగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారని.. కాదు కలవడం లేదని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ స్పందించలేదు. ఎప్పటిలాగే మౌనంగా ఉంటూ వస్తున్నారు.
Tags:    
  • Actor Dhanush 
  • Aishwarya 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS