• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవిశ్రీ మోత మొదలైందిగా..

దేవిశ్రీ మోత మొదలైందిగా..

By - Tupaki Desk
Update: 2018-01-25 05:29 GMT
కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విశేషం బయటికి వచ్చేసింది. నిన్న సాయంత్రమే ‘రంగస్థలం’ టీజర్ విడుదలైంది. ఇది అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఆసక్తికరంగా ఉండటంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం ఆరు గంటల్లోనే ఈ టీజర్‌ కు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీన్ని బట్టే టీజర్ ఎంతగా జనాల దృష్టిని ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. టీజర్ మొత్తం రామ్ చరణ్ చుట్టూనే తిరిగింది. నెవర్ బిఫోర్ లుక్.. మేనరిజమ్స్ తో చరణ్ ఆకట్టుకున్నాడు. చెవిటి వాడిగా అతడి పాత్ర భలే ఆసక్తి రేకెత్తించింది. టీజర్లో సుకుమార్ ముద్ర స్పష్టంగా కనిపించింది.

టీజర్లో చరణ్.. సుకుమార్ తర్వాత బాగా హైలైట్ అయింది దేవిశ్రీ ప్రసాదే. అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైల్ విడిచి పెట్టకుండానే.. సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు దేవి. బ్యాగ్రౌండ్ స్కోర్లో కొంచెం తమిళ టచ్ కూడా ఉంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో తమిళంలో చాలా సినిమాలే తెరకెక్కడం వల్ల ఆ ప్రభావం కూడా కొంత ఉండి ఉండొచ్చేమో. ఓవరాల్ గా చూస్తే టీజర్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద బలంగా నిలిచింది. సినిమాలోనూ మ్యూజిక్ చాలా బాగుండొచ్చన్న అంచనాలు పెంచింది. గత ఏడాది దేవిశ్రీ చాలా సినిమాలే చేశాడు కానీ.. క్రమంగా అతను టచ్ కోల్పోతున్నాడని.. అతడి మ్యూజిక్ రొటీన్ అయిపోతందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు దేవి. మరి ముందుగా దేవి నుంచి రాబోయే పెద్ద సినిమా ‘రంగస్థలం’తో తన ముద్ర ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    
  • Devi Sri Prasad 
  • Rangasthalam Movie 
  • Telugu News 

Similar News

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS