• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దాసరికి టీవీ9 దేవి...

దాసరికి టీవీ9 దేవి మనవరాలు

By - Tupaki Desk
Update: 2020-09-26 03:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ కు మొదటి లేడీ విజేతగా నిలుస్తానంటూ చాలా నమ్మకంగా హౌస్‌ లోకి వెళ్లిన దేవి నాగవల్లి కేవలం ఆర్థిక అవసరాల కోసం బిగ్‌ బాస్‌ విన్నర్‌ అవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. చాలా సీరియస్‌ గా సందర్బానుసారంగా స్పందిస్తూ తన అవసరం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉంటూ దేవి బిగ్‌ బాస్‌ 2 విన్నర్‌ కౌశల్‌ లా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాప్‌ 4 కంటెస్టెంట్స్‌ లో ఖచ్చితంగా ఆమె ఉంటుందేమో అంటూ ఇప్పటి నుండి ఆమెపై చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. దేవి తల్లిగారు తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దేవి ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఇంట్లో ఎలా అయితే పోరాడిందో ఇప్పుడు అక్కడ కూడా అలాగే పోరాటం చేస్తుందన్నారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్‌ బాస్‌ హౌస్‌ లో కూడా అలాగే ఉంటుంది. వాళ్ల నాన్న 2000వ సంవత్సరంలో చనిపోయిన సమయంలో కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుంది. ఆమె అన్నయ్య మరియు తమ్మడు ఇద్దరు కూడా జాబ్‌ చేస్తున్నారు అంటే ఆమె వల్లే. కుటుంబ బాధ్యత మొత్తం తనే మోస్తుంది. కొడుకులు, కోడల్లు, మనవల్లు, దేవి నేను అంతా కలిసే ఉంటాం. మాది రాజమండ్రి మాకు దాసరి నారాయణ రావుగారి కుటుంబంతో బంధుత్వం ఉంది.

దేవి నాన్న గారికి దాసరి నారాయణ రావు మేనమామ అవుతారు. అంటే దాసరి నారాయణ రావు గారు దేవికి తాత వరుస అన్నట్లు. ఆయన పేరును ఎప్పుడు ఎక్కడ కూడా మేము వాడుకోలేదు. ఆయన నుండి అప్పుడు ఎప్పుడు కూడా సాయం పొందలేదు. ఆయన పాలకొల్లు వచ్చినప్పుడు తరుచు కలుస్తూ ఉండేవాళ్లం. వారింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వెళ్తూ ఉండేవాళ్లం. నా కూతురు కాలేజ్‌ డేస్‌ లో మంచి క్రికెటర్‌. ఎన్నో అవార్డులు మరియు బహుమానాలు పొందింది. తను ఎన్నో బాధలు పడి ఈస్థాయికి వచ్చింది. తప్పకుండా ఆమెలోని పట్టుదల విజేతగా నిలుపుతుంది. దేవికి గట్టి పోటీ అంటే నోయల్‌ అనుకుంటున్నాను. మిగిలిన అంతా కూడా బాగా ఆడుతున్నారు అంటూ తన కూతురు బిగ్‌ బాస్‌ షో పై పూర్తి సంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు.
Tags:    
  • Bigg Boss 4 
  • Devi Nagavalli 
  • Dasari Narayanarao 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS