చదువుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి నాది

Update: 2020-05-02 06:45 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో క్రేజీ స్టార్‌ హీరో. ఆదాయంలో కూడా ఇతర యంగ్‌ హీరోలతో పోల్చితే టాప్‌ లో ఉన్నాడు. ఆమద్య మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ గా కూడా నిలిచాడు. రౌడీ స్టార్‌ గా అభిమానులు పిలుచుకునే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కాని ఒకప్పుడు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి ఇంగ్లీష్‌ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విషయమై స్పందించాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ... నా జీవితంలో నాన్న నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సులభం అయ్యింది. లాక్‌ డౌన్‌ సమయంలో నేను మద్యతరగతి వారికి సాయం చేసేందుకు ముందుకు రావడం వెనుక ఒక కారణం ఉంది. నా ఎదుగుదలలో చాలా మంది నాకు తోడ్పాటు అందించారు. నేను సత్యసాయి స్కూల్‌ లో చదువుకున్నాను. మా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వారు నాకు ఉచిత విధ్యను అందించారు.

ఒకానొక సమయంలో చదువుకోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే కొందరు సాయం చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. హీరో అయ్యేందుకు ప్రయత్నించే సమయంలో కూడా తమ్ముడి ఆదాయం పై ఆధారపడ్డట్లుగా రౌడీ చెప్పాడు. ఇప్పుడు నాకంటూ కొంత ఉంది కనుక తిరిగి ఇవ్వడం చేస్తున్నట్లుగా చెప్పాడు.

ప్రస్తుతం ఈయన పూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. హిందీ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సినిమా విడుదల చేయబోతున్నారట. అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యిందని.. లాక్‌ డౌన్‌ ముగిసిన వెంటనే తదుపరి షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని విజయ్‌ పేర్కొన్నాడు.
Tags:    

Similar News