ఆర్జీవీ 'మర్డర్' ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరణ..!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం ''మర్డర్''. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నానని.. ఇది ఓ 'కుటుంబ కథా చిత్రమ్' అని వర్మ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసినప్పటి నుంచి ఇది మిర్యాలగూడలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమా వివాదాస్పదమడమే కాకుండా అమృత కుటుంబ సభ్యులు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కేసును విచారించిన కోర్టు చివరకు 'మర్డర్' విడుదలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఇక సినిమాని పబ్లిసిటీ చేసుకోవడంలో తల పండిపోయిన వర్మ.. డిసెంబర్ 22 (మంగళవారం) మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతామని.. అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతాననని పేర్కొన్నాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ కు పోలీసులు షాక్ ఇచ్చారు. గొడవలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ ప్రెస్ మీట్ కు అనుమతులు నిరాకరించారు. దీంతో చేసేదేమి లేక ఆర్జీవీ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశాడు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్ కు అనుమతులు రాకపోవడంతో ప్రస్తుతానికి రద్దు చేసుకుంటున్నాం. కానీ తర్వాత తప్పకుండా వస్తాను. మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు'' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక 'మర్డర్' సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇది ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి. కాగా, 'మర్డర్' చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్ - సాహితి - భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు.