‘ఢిల్లీ క్రైమ్‌’ వెబ్ సిరీస్‌ కు అరుదైన గౌరవం..!

Update: 2020-11-27 03:30 GMT
ప్రస్తుతం వెబ్​సీరీస్​ల యుగం నడుస్తున్నది. లాక్​డౌన్​తో థియేటర్లు మూతపడటంతో వెబ్​సీరీస్​లకు కాలం కలిసివచ్చింది. ఇక్కడ సెన్సార్​ పరమైన ఇబ్బందులు లేకపోవడంతో దర్శకులు తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. ఈ లాక్​డౌన్​ పీరియడ్​లో అన్ని భాషల్లోనూ వెబ్​సీరిస్​లు వచ్చాయి. ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నాయి. అయితే కొన్ని వెబ్​సీరిస్​ల్లో  శ్రుతిమించిన శృంగారం, బూతు పదాలు వాడారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం యూత్​ను దృష్టిలో ఉంచుకొని దర్శకులు ఈ తరహా కథలను రూపొందిస్తున్నారు.

చాలామంది యువ దర్శకులకు ఈ వెబ్​సీరిస్​లు ఒక వేదికగా కూడా ఉన్నాయి. కొన్ని వెబ్​సీరిస్​లపై హిందూసంఘాలు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా వెబ్​సీరీస్​లు కొత్త నటీనటులను, దర్శకులను, కథరచయితలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. థియేటర్లు లేని లోటును కొంతవరకు తీర్చాయి. అయితే నెట్​ఫ్లిక్స్​ ఇండియాలో రిచీ మెహతా  తెరకెక్కించిన  ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్​ సీరిస్​​కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది.48 వ ఇంటర్నేషన్​ అవార్డుల్లో నెట్ ఫ్లిక్స్​లో ప్రసారమైన ‘ఢిల్లీ క్రైమ్​’కు బెస్ట్​ డ్రామా సీరిస్​ అవార్డు వచ్చింది. ఈ అవార్డును దేశంలోని మహిళంలదరికీ అంకితం ఇస్తున్నట్టు డైరెక్టర్​ రిచీ మెహతా ప్రకటించారు.

షెఫాలీ షా ఈ సినిమాలో పోలీస్​ఆఫీసర్​గా నటించారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆమె సోషల్​మీడియాలో వెబ్​సీరిస్​లోని ఓ సన్నివేశాన్ని పోస్ట్​ చేశారు. ఈ వెబ్​సీరిస్​లో షెఫాలీ షా, రసికా దుగ్గల్, అదిల్ హుస్సైన్, రాజేశ్ తైలాంగ్ ముఖ్యపాత్రలు పోషించగా.. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్, మర్డర్ కేస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో నలుగురు దుర్మార్గులు బస్సులో వెళుతున్న ఫిజియోథెరపీ విద్యార్థిని దారుణంగా రేప్​చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ కథ ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.
Tags:    

Similar News