క‌వ‌ర్ పేజీ సూప‌ర్ గాళ్ అయితే స‌రిపోదు!

Update: 2021-02-10 07:44 GMT
బాలీవుడ్ లో సీనియ‌ర్ భామ‌లుగా క‌త్రిన‌.. దీపిక ప‌దుకొనే త‌మ స్థానాన్ని చెక్కు చెద‌ర‌కుండా కాపాడుకుంటూ ఇప్ప‌టికీ యువ‌నాయిక‌ల‌తో పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ భామ‌లు త‌మ అంద‌చందాల్ని కాపాడుకునేందుకు నిరంత‌రం జిమ్ యోగా అంటూ వేసే ఫీట్ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం ఇన్ స్టా వేదిక‌గా అందుకు సంబంధించిన ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

దీనికి తోడు ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ కి సంబంధించిన ఫోటోషూట్ల‌తోనూ ఈ భామ‌లు వేడి పెంచుతూనే ఉన్నారు. ప్ర‌ఖ్యాత జీక్యూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ నుంచి ఇంత‌కుముందు కత్రిన హాటెస్ట్ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా జీక్యూ ఆర్చీవ్స్ నుంచి దీపిక‌కు చెందిన‌ ఓ అన్ నోన్ ఫోటోషూట్ రివీలైంది. ఈ ఫోటోలో డిప్స్ సూప‌ర్ గాళ్ నే త‌ల‌పిస్తోంది. టాప్ టు బాట‌మ్ బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ లో హాలీవుడ్ యాక్ష‌న్ క్వీన్ ల‌నే మించిపోయింది దీపిక‌. రెసిడెంట్ ఈవిల్ న‌టి మిలా జోవిచ్.. మెలీసా మేరీ బోనిసె వంటి తార‌ల్నే మించిపోయింది.

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ వెబ్ సిరీస్ లు హాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తున్న ప్రియాంక చోప్రా సూప‌ర్ గాళ్ పాత్ర‌లో మెరుస్తోంది. త‌దుప‌రి అబ్బాస్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో క‌త్రిన కూడా సూప‌ర్ గాళ్ పాత్ర‌ను పోషించ‌నుంది. ఇక కంగ‌న ఇప్ప‌టికే క్రిష్ సిరీస్ లో ఆ త‌ర‌హా పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. ఇక దీపిక ఎప్ప‌టికి ఆ ఫీట్ వేస్తుందో చూడాలి. లార్జ‌ర్ దేన్ లైఫ్ సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్స్ తో క‌ట్టి పడేసే స‌త్తా ఉన్నా దీపిక ఇప్ప‌టికే లేట్ చేసింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ప‌ద్మావ‌త్ తో వ‌చ్చిన పేరును నిల‌బెట్టుకునేందుకు దీపిక కూడా క‌థ‌ల‌ సెలెక్ష‌న్ మారుస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News