స్టేజ్ మీదనే షారుక్ ని కిస్ చేసిన దీపికా

Update: 2023-01-31 10:06 GMT
షారుఖ్ ఖాన్ హీరోగా సిదార్ద్ ఆనంద్ దర్శకత్వంలో హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పఠాన్. ఈ సినిమాలో దీపికా పదుకునే షారుఖ్ ఖాన్ కి జోడీగా నటించింది. జాన్ అబ్రహం మూవీలో విలన్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఐదు రోజుల్లో 500 కోట్ల గ్రాస్ ని కలెక్షన్స్ చిత్రంగా పఠాన్ నిలిచింది.

ఇక షేర్ పరంగా చూసుకున్న 300 కోట్ల మార్క్ దాటిపోయింది. పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వచ్చేయగా ఇప్పుడు వస్తున్నదంతా ప్రాఫిట్ గానే ఉందని టాక్. నార్త్, సౌత్ అనకుండా ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ సినిమాకి వస్తుంది.

ఓ వైపు ఒక వర్గం వారు నెగిటివ్ ప్రచారం చేసిన కూడా దానిని తట్టుకొని పఠాన్ నిలబడింది అని చెప్పాలి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ వేడుక తాజాగా జరిగింది.

 ఇందులో దీపికా పదుకునే హై హీల్స్ వేసుకొని కనిపించింది. అసలే పొడుగు కాళ్ళ సుందరి అనే ఇమేజ్ దీపికాకి ఉంది. షారుఖ్ ఖాన్ పక్కన దీపికా నిలబడి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అంటే కాకుండా స్టేజ్ మీద అందరి ముందు ఆమె క్రిందికి వంగి షారుఖ్ ఖాన్ చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టడం విశేషం. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పఠాన్ సినిమాలో షారుఖ్, దీపికా మీద చిత్రీకరించిన బెషారమ్ రంగ్ సాంగ్ ఎంత వివాదం అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఆ సాంగ్ ని గుర్తుచేసుకుంటూ ఈ వీడియో ని కొంతమంది పాజిటివ్ గా వైరల్ చేస్తూ ఉంటే యాంటీ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ హిట్ ని చూపిస్తూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View

Similar News