• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డిసెంబర్ రిలీజులు: క్లాస్...

డిసెంబర్ రిలీజులు: క్లాస్ Vs ఊరమాస్

By - Tupaki Desk
Update: 2019-12-04 05:25 GMT
క్లాసు మాసు తేడాలు లేవని ప్రేక్షకులకు నచ్చే సినిమా హిట్ అని.. నచ్చని సినిమా ఫ్లాప్ అని కొందరు జంబలకిడి పంబ లాజిక్కులు చెప్తుంటారు.  అలా అయితే 'ఇస్మార్ట్ శంకర్' ఎందుకు క్లాస్ ఆడియన్స్ లలో ఎక్కువమందికి నచ్చలేదు.  మొహన్ లాల్ 'మనమంతా' ఎందుకు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు?  ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్లాస్ మాస్ సినిమాలకు తేడా ఉంటుంది. అయితే కొన్ని సినిమాల్లో యూనివర్సల్ అప్పీల్.. అన్నీ ఎలిమెంట్స్ ఉండడం కారణంగా అందరూ చూస్తారు అంతే.

ఇక డిసెంబర్ లో క్రిస్మస్ వరకూ విడుదల కానున్న సినిమాల విషయమే తీసుకుంటే క్లాస్ Vs ఊరమాస్ అన్నట్టుగా ఉంది వ్యవహారం.  డిసెంబర్ లో ముందుగా రిలీజ్ కానున్న సినిమా 'వెంకీమామ' ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి క్లాస్ ఫిలిం కిందకే వస్తుంది.  అటు వెంకీకి ఇటు చైతుకు కుటుంబ ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ కాబట్టి మాస్ అంశాలు.. బోల్డ్ అంశాలకు స్కోప్ తక్కువే.  తర్వాత వారంలో రిలీజ్ అయ్యే తేజు-మారుతిల 'ప్రతిరోజూ పండగే' కూడా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన క్లాస్ సినిమానే.  ఇక నందమూరి బాలకృష్ణ సినిమా 'రూలర్' ఎలా ఉంటుందో ఆ టీజర్ శాంపిల్ ఇచ్చేసింది. ఊరమాస్ బాలయ్య స్టైల్ ఫిలిం. డిసెంబర్ లో రిలీజ్ కానున్న మరో మాస్ సినిమా '90ML'. కార్తికేయ గుమ్మకొండ యువ హీరో.. యూత్ ఆడియన్స్ లైక్ చేసే హీరో అయినప్పటికీ ఈ సినిమా కంటెంట్ మాత్రం మోటుగా.. యమా నాటుగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్టే ఉంది.

మరి ఈ క్లాసు మాసుల పోరాటం లో ఏ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటాయో వేచి చూడాలి.   ఇవి కాకుండా రాజ్ తరుణ్ 'ఇద్దరిలోకం ఒకటే' ఒక లవ్ స్టొరీ. ఇది యూత్ ను టార్గెట్ చేసిన సినిమా. ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ డిసెంబర్ నెలలో బాక్స్ ఆఫీసును ఎవరు షేక్ చేస్తారో  తెలియాలంటే నెలాఖరు వరకూ ఎదురు చూడక తప్పదు.
Tags:    
  • December Tollywood Relases 
  • Ruler Release Date 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu Movie News 
  • Tupaki News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS