'బుట్ట బొమ్మ' పాటకు స్టెప్పులేసిన వార్నర్ దంపతులు..!
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమవడంతో పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. అనుకోని విధంగా వచ్చిన ఈ హాలిడేస్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూనే లాక్ డౌన్ వేళ తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. అలాగే డేవిడ్ వార్నర్ చాలాకాలంగా టిక్ టాక్ తోపాటు ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలలో అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తున్నాడు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ తరచూ ఏదో ఒక వీడియోతో ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులను సంతోష పెడుతున్నాడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇప్పుడు తన భార్యతో కలిసి మన తెలుగు సినిమా పాటకి స్టెప్పులేస్తున్నాడు. తాజాగా తెలుగు పాటకు తన భార్య క్యాండిస్ తో కలిసి స్పెప్పులేసిన వీడియో వైరల్ అయింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సామజవరగమన.. రాములో రాములా.. బుట్ట బొమ్మా.. అనే సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా 'బుట్ట బొమ్మా' సాంగ్ లోని స్టెప్స్ యూత్ ని బాగా ఆకర్షించాయి. ఇప్పటికే ఈ పాటకి చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలు స్టెప్పులేస్తూ వీడియోలను పోస్ట్ చేసారు. తాజాగా ఈ 'బుట్ట బొమ్మ' పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్ తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ దంపతులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో వారి కుమార్తె కూడా స్టెప్పులు వేస్తూ కనపడింది. 'బుట్టబొమ్మ' పాటకు వారు చేసిన టిక్ టాక్ వీడియో అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించి వార్నర్ ఈ పాటకు డ్యాన్స్ చేయడం గమనార్హం. తన పాట ఇంత పాపులర్ కావడం.. ఓ స్టార్ క్రికెటర్ డ్యాన్స్ చేయడంతో బన్నీకి ఆనందాన్ని కలిగించింది. తాజాగా దీని పై స్పందించిన అల్లు అర్జున్.. ''థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. తమన్ స్వరపరచిన ఈ 'బుట్టబొమ్మా' సాంగ్ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించింది.
వీడియో కోసం క్లిక్ చేయండి