అక్టోబర్ 2న ఓటీటీలో అనుష్క 'నిశబ్దం'...!

Update: 2020-09-18 10:50 GMT
కరోనా కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలలో అనుష్క - మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ''నిశబ్దం'' కూడా ఒకటి. అనేక వాయిదాల అనంతరం చివరికి సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న 'నిశబ్దం' మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ చేయడం కుదరలేదు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా డిజిటల్ రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే 'నిశ్శబ్దం' మేకర్స్ మాత్రం సినిమా థియేటర్లు తెరుచుకునే రోజు కోసం ఎదురు చూస్తూ.. ఓటీటీ ఆఫర్లు తిరస్కరిస్తూ వచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితులు మారకపోవడంతో ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపారు.

తాజాగా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో 'నిశబ్దం' మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ లో గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేన్నట్టుగా అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు వెల్లడించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌.. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. అంజలి - షాలిని పాండే - మైఖేల్ మ్యాడ్స‌న్ - సుబ్బ‌రాజు - శ్రీనివాస అవ‌స‌రాల‌ - హంట‌ర్ ఓ హ‌రో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. 'భాగమతి' సినిమా తర్వాత స్వీటీ అనుష్క ని పూర్తి స్థాయి రోల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ అక్టోబర్ 2న ఓటీటీలో చూడబోతున్నారన్నమాట.
Tags:    

Similar News