దాసరి సార్.. భలే చెప్పార్లెండి

Update: 2017-01-23 05:35 GMT
మన సెలబ్రెటీల్ని కానివ్వండి.. మన సామాన్య ప్రేక్షకుల్ని కానివ్వండి.. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు.. నచ్చిన సినిమా ఏది అని అడిగి చూడండి. బాలీవుడ్డుకో.. హాలీవుడ్డుకో వెళ్లిపోతారు. నిజంగా ఓ తెలుగు సినిమా మీద.. తెలుగు దర్శకుడి మీద అభిమానం ఉన్నా సరే.. ఆ విషయం చెప్పరు. తమకేదో మంచి టేస్టుందని అందరూ అనుకోవాలన్న ఉద్దేశం కాబోలు.. గొప్పలకు పోతుంటారు. ఇదే విషయమై ఓ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గట్టిగా వాయించేశారు. మన వాళ్లను.. మన సినిమాను మనం కించపరుచుకోవడం గురించి ఆయన ఫైర్ అయ్యారు.

‘‘మన గొప్పదనం మనకు తెలియదు. తెలుగువాడు అరుదైన ఘనత సాధిస్తే పట్టించుకోం. ‘మీ అభిమాన దర్శకుడు ఎవరు’ అని ఏ తెలుగువాడినైనా అడగండి. మణిరత్నం పేరో.. బాలచందర్‌ పేరో చెబుతారు. కేవీ రెడ్డి లాంటి వాళ్లు గుర్తుకురారు. మీకు నచ్చిన సినిమా ఏది అని అడిగితే ఊరూ పేరు తెలియని దర్శకుడు తీసిన ఇంగ్లిష్ సినిమా పేరు చెబుతారు. కానీ తమిళం వాళ్లు.. కర్నాటక వాళ్లు.. కేరళ వాళ్లు అలా కాదు. ముందు మేం.. మా తరవాతే ఎవరైనా’ అంటారు. మనల్ని మనమే మరుగుజ్జులం చేసుకొంటున్నాం’’ అన్నారు దాసరి. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘అభిషేకం’ సీరియల్ 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సుబ్బిరామిరెడ్డి తనను సత్కరించిన సందర్భంగా దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ సీరియళ్లు నిర్మించడం..దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదని.. ఇప్పటి స్టార్‌ దర్శకులెవరైనా ఓ సీరియల్‌ వంద ఎపిసోడ్లు పూర్తి చేసినా వాళ్లకు పాదాభివందనం చేస్తానని దాసరి వ్యాఖ్యానించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News