• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బాండ్‌ గా నటించను'.. ఓ...

'బాండ్‌ గా నటించను'.. ఓ పిచ్చి అబద్ధం

By - Tupaki Desk
Update: 2017-08-17 10:31 GMT
మాటలు మార్చడంలో.. తూచ్ అనేయడంలో.. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో మన సెలబ్రెటీలే కాదు.. హాలీవుడ్ తారలు కూడా తక్కువోళ్లేమీ కాదనడానికి ఇది రుజువు. రెండేళ్ల కిందట జేమ్స్ బాండ్ సిరీస్‌ లో భాగంగా వచ్చిన కొత్త సినిమా ‘స్పెక్టర్’ విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో డేనియల్ క్రెయిగ్.. తాను ఇకపై జేమ్స్ బాండ్ పాత్ర చేసే సమస్యే లేదన్నాడు. బాండ్ క్యారెక్టర్ చేయడం కంటే నరకం మరొకటి లేదని.. అంత కష్టం ఇంకెందులోనూ ఉండదని.. ఎన్ని వందల కోట్లిచ్చినా ఇకపై బాండ్ పాత్ర చేయనని కుండబద్దలు కొట్టాడు. అబ్బో.. బాండ్ క్యారెక్టర్ అంటే అంత కష్టమా అంటూ జనాలు ఓ మాట్లాడేసుకున్నారు.

కట్ చేస్తే రెండేళ్లు గడిచాక ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ మళ్లీ బాండ్ పాత్రకు రెడీ అయిపోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇదే విషయం అతణ్ని అడిగితే.. ఔను నిజమే అన్నాడు. బాండ్ క్యారెక్టర్ చేయడానికి ఇతణ్ని బలవంతంగా ఒప్పించారేమో అనుకున్నారు జనాలు. కానీ అప్పుడు బాండ్ పాత్ర చేయను అన్నారే అంటూ క్రెయిగ్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అప్పుడేదో సరదాకు అన్నాను. అదో పిచ్చి అబద్ధం’’ అంటూ తేలిగ్గా మాట్లాడాడు. కానీ అప్పుడు క్రెయిగ్ బాండ్ పాత్రలో ఉన్న కష్టం గురించి.. తాను ఈ పాత్రకు టాటా చెప్పేయడం గురించి  ఇంటెన్సిటీతో చెప్పాడో? కానీ ఇప్పుడు మాత్రం అదో పిచ్చి అబద్ధం అనడం ద్వారా అప్పుడు తన మాటల్ని నమ్మిన వాళ్లందరినీ పిచ్చోళ్లను చేసేశాడు. దీన్ని బట్టి చూస్తే అప్పుడు బాండ్ గారు చేసిందంతా జస్ట్ పబ్లిసిటీ స్టంటే అన్నమాట. జేమ్స్ బాండ్ సిరీస్ లో రాబోతున్న 25వ సినిమా.. ఈ ఏడాది చివర్లో ఆరంభం కాబోతోంది. 2019 నవంబరు 8న ఈ చిత్రం విడుదలవుతుంది.
Tags:    
  • Daniel Craig 
  • james Bond Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS