అమ్మో తమ్ము.. భయపెడుతోంది!!

Update: 2016-10-27 09:13 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా బాగా స్ట్రెయిట్ ఫార్వార్డ్. అలాగని ఈ విషయాన్ని పైకి ఓపెన్ చెప్పదు కానీ.. ఆ సంగతి అర్ధమయ్యేందుకు అనుగుణంగా డ్రెసింగ్ మాత్రం చేస్తూ ఉంటుంది. సినిమాల్లో గ్లామర్ డోస్ తెగ చూపించేసినా.. అమ్మడి ఫిజిక్ కి అన్ని రకాల డ్రస్సులు మ్యాచ్ అయిపోవడంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటుంది. మరి మిల్కీ కేజువల్ డ్రసింగ్ ఎలా ఉంటుందో తెలుసా?

ఇదుగో.. ముంబై ఎయిర్ పోర్టులో తీసిన ఈ ఫోటో చూస్తే.. తమన్నా డ్రెసింగ్ స్టైల్ ఏంటో అర్ధమవుతుంది. డెనిమ్ జీన్స్.. టీ షర్ట్ తో సో సింపుల్ గా ఉన్నట్లు అనిపించినా.. అమ్మడు ఓ మెసేజ్ కూడా ఆ డ్రస్ పాటే ఇచ్చేస్తోంది. సాధారణంగా అమ్మాయిలు.. అందులోనూ హీరోయిన్లు తమ డ్రసింగ్ విషయంలో క్యాచీగా ఉండేలా అట్రాక్ట్ చేసేలా జాగ్రత్త పడతారు. కానీ తమన్నా మాత్రం టీ షర్ట్ పై ఓ పుర్రె బొమ్మ వేసుకుని వచ్చి.. తను డేంజర్ అని సింబాలిక్ గా చెప్పేస్తోంది. నిజానికి రియల్ లైఫ్ లో కూడా అమ్మడి బిహేవియర్ ఈ స్కల్ కి దగ్గరగానే ఉంటుందట.

జోలికి రానంతవరకూ ఎవరినీ పట్టించుకోదని.. తేడా వస్తే వదిలిపెట్టదని టాక్. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ మూవీ అభినేత్రి అమ్మడి ఆశలను పూర్తిగా నెరవేర్చలేకపోయినా.. యాక్టింగ్. డ్యాన్స్ విషయంలో మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులను తెచ్చి పెట్టింది. రాబోయే చిత్రాల్లో బాహుబలి2 తనకు మళ్లీ బిగ్ బ్రేక్ ఇచ్చేస్తుందనేది తమ్మూ హోప్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News