దగ్గుబాటి వారసుడు, డి. సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమకథా చిత్రాలతో యువతరాన్ని ఉర్రూతలూగించిన తేజ మళ్లీ ఇన్నాళ్లకు సరికొత్త ప్రేమకథతో `అహింస` అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తియింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రానా హీరోగా తెరకెక్కిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజ ఆ తరువాత `సీత` మూవీతో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నారు. మళ్లీ తనదైన పంథాలో ట్రాక్ లోకి రావాలనే ప్లాన్ తో ఆయన `అహింస` సినిమాని ఎంచుకున్నారు. దీపావళికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది తేజ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో ఎంత మంది ఆర్టిస్ట్ లని, టెక్నీషియన్ లని వెండితెరకు పరిచయం చేసిన తేజ ఈ సినిమాతో అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు.
ఈ సందర్భగా ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో `అహింస` విషయంలో దగ్గుబాటి వారసుడిపై తాను ఆ ట్రిక్స్ వాడానని దర్శకుడు తేజ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్ల కోసం చూడరు. మంచి సినిమా కావాలనుకుంటారు. మంచి కథలో గాడిదను హీరోగా పెట్టినా సినిమా హిట్టవుతుంది. చెత్త కథలో అబితాబ్, అమీర్, రజనీకాంత్ లు కలిసి నటించినా కూడా ఆడదు.
ఎమోషన్, స్టోరీ బాగుంటేనే హిట్. నేను ఆ స్టోరీని నమ్ముకున్నాను. విజయా, సురేష్ ప్రొడక్షన్స్ కథను నమ్మి పెద్ద సంస్థలుగా ఎదిగాయి. కంటెంట్ బాగుంది కాబట్టే ఓటీటీలో మనం విదేశీ చిత్రాలు చూస్తున్నాం. నేను ఎమోషన్ ని నమ్ముతాను. స్టార్ ని నమ్ముకుంటే కొత్తగా తీయలేం. `నేనే రాజు నేనే మంత్రి` సినిమాలో రానాకు బదులు జూనియర్ ఎన్టీఆర్ ని పెడితే అభిమానులు నన్ను కొట్టేవాళ్లు.
ఆర్టిస్ట్ ల విషయంలో నేను కనికరం చూపని దర్శకుడిని. `అహింస` సినిమాలో అభిరామ్ పై అన్ని ట్రిక్స్ వాడాను. కావాలనుకున్న అవుట్ పుట్ ఇచ్చాడా లేదా అనేదే నాకు ముఖ్యం. తను నాయుడిగారి మనవడు, సురేష్ బాబు గారి అబ్బాయి అనేది నేనే పూట్టించుకోను. నా సినిమాలో క్యారెక్టర్ లా బిహేవ్ చేయాలి అంతే. మధ్య ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్ పుట్ విషయంలో చాలా రోజులు తరువాత చాలా హ్యాపీగా వున్నాను. దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన వుంది. ఇందులో 25 మంది కొత్త నటీనటులు నటించారు` అని తెలిపారు తేజ.