సినీ ఇండస్ట్రీ పేరు చెప్పి కాంట్రాక్టుల పేరిట మోసాలు
సినీ హీరోలు, ప్రముఖుల పేరు చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లతో పరిచయాలున్న వారే ఈ దారుణాలకు తెగబడుతున్నారు. సినిమా ప్రముఖులతో సంబంధాలున్నాయని అమయాకులను దోచేస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు.
తాజాగా మేకప్ ఆర్టిస్టులను లక్ష్యంగా చేసుకొని ఈవెంట్స్, పెళ్లిళ్లకు మేకప్ కాంట్రాక్టుల పేరుతో రూ.25 వేలు దోచేశారు ఇద్దరు కేటుగాళ్లు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు రట్టు అయ్యింది.
ఫిల్మ్ చాంబర్ లో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ తోపాటు మరో యువకుడు ఇందులో సూత్రధారులని వారిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్న వారు కావడం గమనార్హం.
చిన్న చిన్న ఈవెంట్లు, ప్రముఖుల పెళ్లిళ్లు, పేరంటాలకు మేకప్ చేసే ఓ వ్యక్తికి మా ఇంట్లో పెళ్లి ఉందని.. మేకప్ కాంట్రాక్ట్ ఇస్తామని కేటుగాళ్లు మెసేజ్ పంపారు.ఫలానా హీరోకు దగ్గరి మనిషిని నమ్మబలికారు. హీరో నితిన్ పెళ్లి కన్నా రిచ్ గా చేయాలని కోరాడు. రూ.50లక్షల కాంట్రాక్టును కుదుర్చుకున్నాడు. రూ.20లక్షలు బ్యాంకు ఖాతాకు పంపుతున్నామని నాటకమాడాడు.
అయితే బాధితుడి ఖాతాకు డబ్బులు జమ కాలేదు. అంత పెద్ద మొత్తానికి కరెంట్ ఖాతా కావాలని.. ఆగిపోయాయని.. బ్యాంకు మేనేజర్ కు రూ.25వేల లంచం ఇస్తే బదిలీ చేస్తాడని నమ్మబలికాడు. అలా రూ.25వేలను ఓ ఉబెర్ బైక్ వ్యక్తికి ఇవ్వాలని సూచించారు కేటుగాళ్లు. దీంతో మేకప్ మెన్ రూ.25వేలు సదురు బైకర్ కు ఇవ్వగా.. ఆ తర్వాత ఫోన్ చేస్తే కేటుగాళ్లు స్పందించలేదు. దీంతో బాధితుడు గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా సినీ ఇండస్ట్రీ పేరుతో మోసాలకు తెగబడుతూ అమాయకులను దోచుకుంటున్నారు.