టీవీ న‌టి న‌గ్న ఫోటోషూట్ పై తీవ్ర విమర్శ‌లు

Update: 2021-01-06 02:30 GMT
ఒక సాంప్ర‌దాయ న‌టి న‌గ్నంగా క్యాలెండర్ కోసం ఫోజులివ్వ‌డం అంటే సాహ‌స‌మే. కానీ మ‌రాఠా రంగ‌స్థ‌లం నుంచి సినిమాల్లో ప్ర‌వేశించిన ఓ న‌టి అందుకు సాహ‌సించింది. నాట‌కాలు సీరియ‌ళ్ల‌లో పాపులారిటీ ద‌క్కించుకుని అటుపై వెండితెర వైపు అడుగులు వేసిన మ‌రాఠా న‌టి వ‌నితా ఖ‌ర‌త్ సాహ‌సం గురించే ఇదంతా.

వ‌నిత ఇంత‌కుముందు అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ లో వంట‌మ‌నిషి పాత్రలో న‌టించి మెప్పించారు. షాహిద్ క‌పూర్ ఇంట్లో ప‌నిచేసే పుష్ప అనే వంట‌మ‌నిషిగా చ‌క్క‌ని హాస్యంతో న‌వ్వులు పండించి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నారు.

2021 లో అడుగు పెట్టిన సంద‌ర్భంగా ఓ క్యాలెండ‌ర్ కోసం న‌గ్నంగా ఫోటోషూట్ లో పాల్గొని సంచ‌ల‌నాల‌కు తెర తీసిన వ‌నిత పై అంతే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అభిమానులు ఆమెను ఆ కోణంలో అస్స‌లు ఊహించ‌క‌పోవ‌డంతో వ‌నిత పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోషూట్ ఎలా ఉంది? అంటే.. వ‌నిత న‌గ్నత్వాన్ని ఒక ప‌తంగు(గాలిప‌టం) క‌వ‌ర్ చేస్తూ ఉంటే తాను స్వేచ్ఛ‌గా హాయిగా గాల్లో ఎగురుతోంది. ఈ వీడియోని తనే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలు యూట్యూబ్ లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. త‌న శ‌రీర‌భాష‌పై న‌మ్మ‌కంతో త‌న‌కు న‌చ్చిన విధంగా స్వేచ్ఛగా పాల్గొన్న ఫోటోషూట్ ఇద‌ని వ‌నితా ఖ‌ర‌త్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. తాను ఎప్పుడూ త‌న ప్ర‌తిభ విషయంలో వ్య‌క్తిత్వం విష‌యంలో గ‌ర్వ‌ప‌డుతుంటాయ‌ని వ‌నిత చెబుతున్నారు. మ‌రాఠా టీవీ రంగంలో వ‌నిత పాపుల‌ర్ న‌టి. వెండితెర‌పైనా పెద్ద కెరీర్ ని ఆశిస్తున్నారు.
Tags:    

Similar News