'మహేష్ - రాజమౌళి' చిత్రం పై క్రేజీ అప్డేట్..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కాంబినేషన్ పై వార్తలు సంచలనం అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం ఉండబోతోందని దర్శకధీరుడు రాజమౌళి కన్ఫర్మ్ చేసేసాడు. అయితే రాజమౌళి తీయబోయే ప్రాజెక్ట్ పై ఆల్రెడీ ప్రకటించినప్పుడే అంచనాలు భారీగా ఊపందుకున్నాయి. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కాంబో సెట్ అయ్యేసరికి మహేష్ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుంది..? అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.
మహేష్ తో రాజమౌళి జేమ్స్ బాండ్ తరహా చిత్రం చేస్తాడని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో రాజమౌళి చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తాడని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇన్నేళ్లుగా మహేష్ ఒక్క చారిత్రాత్మక చిత్రం చేయలేదు. అందులోను ఓ ఇంటర్వ్యూలో మహేష్.. "రాజమౌళిలాంటి దర్శకుడు ఉంటే చారిత్రాత్మక సినిమాలో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని. రాజమౌళి లేకపోతే అలాంటి కథల్లో నటించేందుకు కాస్త ఆలోచిస్తాను" అని మనసులో మాట బయటపెట్టేసాడు.
ఈ క్రమంలో రాజమౌళి కూడా మహేష్ కోసం చారిత్రాత్మక చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పీరియాడిక్ ఫిల్మ్ ఇదివరకు బాహుబలి జానపదం జానర్లో తెరకెక్కించాడు. సో ఇప్పుడు సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ రూపొందించే అవకాశం ఎక్కువగా ఉందని పలు సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజమో రాజమౌళినే కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే మహేష్ చిత్రం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఆల్రెడీ మహేష్ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తయితే.. వెంటనే రాజమౌళి చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి బాహుబలి - ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత మహేష్ కోసం ఏ కథ సిద్ధమవుతుందో.. దానికి ఏం టైటిల్ పెడతారోనని ఓవైపు మహేష్ అభిమానులలో ఆసక్తి మాములుగా లేదు. చూడాలి మరి జక్కన్న మహేష్ ను పాన్ ఇండియా స్టార్ చేస్తాడో లేకపోతే పాన్ ఆసియా స్టార్ చేస్తాడో..!